వారంలో ఒక్కో రోజు మనం ఒక్కో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే వారానికి తగ్గట్టుగా మనం కొన్ని పనులని చేస్తూ ఉంటాము. కొన్ని పనులు ఆ రోజు చేయకూడదని, కొన్ని పనులు ఆ రోజు చేస్తే మంచిదని.. ఇలా ప్రతీ రోజుకు కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. మంగళవారం నాడు కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
హిందూమతంలో వారంలో ప్రతిరోజు ఒక దేవుడు, ఒక గ్రహానికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఆంజనేయస్వామి రోజు. అలాగే అంగారకుడికి మంగళవారం అంకితం చేయబడింది. అంగారకుడు ఎరుపు రంగులో ఉంటాడు. మంగళవారం అంగారకుడుని పూజించడం వలన దోషాల నుంచి బయటపడచ్చని జోతిష్య నిపుణులు చెప్తున్నారు.
మంగళవారం నాడు గడ్డం గీసుకోవడం మంచిది కాదు. ఇతర రోజుల కంటే మంగళవారం నాడు ఎక్కువ కోపం వస్తుంది. మంగళవారం నాడు షేవింగ్ చేసుకోకూడదు. షేవింగ్ కి బుధవారం ఉత్తమ రోజు.
మంగళవారం నాడు మినప్పప్పుని కూడా తినకూడదు. మినప్పప్పు శని గ్రహానికి సంబంధించినది. కనుక మంగళవారం నాడు మినప్పప్పు తినడం మంచిది కాదు.
మంగళవారం నాడు గోర్లు కత్తిరించుకోవడం పదునైన పరికరాలను ఉపయోగించి గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు, శనివారం నాడు కూడా ఇటువంటివి చేయకూడదు. గురువారం నాడు కూడా గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదు.
మంగళవారం నాడు నల్లటి దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలుపు రంగు దుస్తులు వేసుకుంటే మీ పురోగతిపై ప్రభావం పడుతుంది. మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాలి.
హనుమంతుడిని భూమిపుత్ర అని కూడా పిలుస్తారు. మంగళవారం నాడు భూమిని తవ్వడం లాంటివి చేయకూడదు. ఇంటికి పునాది వేసుకోవడం లాంటివి కూడా మంగళవారం నాడు చేయకూడదు. సోమవారం, గురువారం ఇలాంటి వాటికి మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం