Trigrahi Yogam: 300 సంవత్సరాల తర్వాత మహా శివరాత్రి రోజున త్రిగాహి యోగం.. ఈ 4 రాశుల వారికి శివుని అనుగ్రహం
Trigrahi Yogam: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజున కూడా గ్రహాలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సారి శివరాత్రి నాడు కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు, శని కలయికతో అరుదైన త్రిగాహి యోగం జరుగుతుంది. ఈ యోగం 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది.
శివరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రిని జరుపుకుంటారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో శివారాధనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆలయానికి వెళ్లి శివరాత్రి జరుపుకోలేని వారు ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.

అదే విధంగా జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజున కూడా గ్రహాలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సారి శివరాత్రి నాడు కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు, శని కలయికతో అరుదైన త్రిగాహి యోగం జరుగుతుంది.
ఈ యోగం 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది. త్రిగాహి యోగం అన్ని రాశుల జీవితాలను మారుస్తుంది. ఆ రాశుల వారికి శివుని ఆశీస్సులు ఎలా ఉంటాయో చూద్దాం.
1.మేష రాశి:
శివరాత్రి రోజున ఏర్పడే త్రిగాహి యోగం మేష రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆర్థికంగా మెరుగుపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. వ్యాపారం, పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి.
2.వృషభ రాశి:
ఈ రాశి వారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎంతో శ్రమతో అనుకున్న కార్యాన్ని సాధించడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
3.తులా రాశి:
ఈ రాశి వారికి అన్ని ఆర్థిక సమస్యలు తొలగుతాయి.మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.
4.మకర రాశి:
ఈ యోగం మకర రాశి వారి జీవితంలో చాలా మార్పు తెస్తుంది. ఈ రాశి వారి జీవితం విజయవంతమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.శుభవార్త వింటారు. పనిచేసే వారికి పదోన్నతులు లభిస్తాయి.
ఈ మహా శివరాత్రి రోజున ఏర్పడుతున్న త్రిగాహి యోగం 300 సంవత్సరాల తరువాత వస్తోంది. ఈ అరుదైన, పవిత్రమైన సందర్భంలో శివుడిని పూజించడం భక్తుల కోరికలను నెరవేరుస్తుంది.
మహా శివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు, చంద్రుని కలయిక ద్వారా చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు శుక్రుడు, శని, కుంభరాశిలో సూర్యుడు మరియు మీనంలో రాహువు. బుధుడి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.