Venus transit: శుక్రుడి సంచారం.. వీరికి అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది
Venus transit: త్వరలో శుక్రుడు రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టేస్తాయి. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
Venus transit: గ్రహాల రాశి మార్పు ప్రేమ జీవితం, ఆరోగ్యం, వివాహ సంబంధాలు, ఆర్థిక పరిస్థితి, వృత్తి వంటి వాటిలో హెచ్చుతగ్గులు కల్పిస్తుంది. కొందరికి గ్రహాల రాశి మార్పు బాగుంటే మరికొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. సంపదను ఇచ్చే శుక్రుడు ఈ సారి కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు ఇవ్వబోతున్నాడు.
శుక్రుడు ఏప్రిల్ 24 న మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు ప్రేమ, అందం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు. శుక్రుడి దయ ఉంటే సౌలభ్యం, భౌతిక ఆనందం పొందుతారు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. అయితే మేషరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పదే పదే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందువల్ల ఈ రాశుల జాతకులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంభించేందుకు ప్రయత్నించాలి.
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి సమస్యలు తీసుకురాబోతుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక లేదా శారీరక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. ఒత్తిడిని నివారించే మార్గాలు అవలంభించాలి. అప్పుడే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారు.
కన్యా రాశి
శుక్రుడు కన్యా రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందుల ఇవ్వబోతున్నాడు. వీటిని నివారించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. శుక్రుడి సంచారం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి
మీది వృశ్చిక రాశి అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. వైద్య పరమైన మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. చిన్నచిన్న సమస్యలు వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవే పెద్దవిగా మారే ప్రమాదం ఉంది.
మకర రాశి
మకర రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కాలంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తిని బలపరిచే ఆహారాలు తీసుకోవాలి. ధ్యానం, యోగ, ప్రకృతిలో గడపటం వంటివి మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి శుక్రుడి సంచారం అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టబోతుంది. ఈ సమయంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం మంచి అలవాట్లు కలిగిన జీవనశైలిని కొనసాగించడం కష్టంగా మారుతుంది. పని లేదా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటున్నట్లయితే ముందు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.