కర్కాటకంలో శుక్రుడి సంచార ఫలితంగా లక్ష్మీయోగం.. 4 రాశులకు ధన లాభం-transit of venus in cancer results in lakshmi yoga it gives money gain for 4 moon signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Transit Of Venus In Cancer Results In Lakshmi Yoga It Gives Money Gain For 4 Moon Signs

కర్కాటకంలో శుక్రుడి సంచార ఫలితంగా లక్ష్మీయోగం.. 4 రాశులకు ధన లాభం

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 09:33 AM IST

కర్కాటక రాశిలో శుక్ర సంచారం కారణంగా లక్ష్మీయోగం ఏర్పడింది. దీని ఫలితంగా పలు రాశులకు ప్రయోజనం చేకూరనుంది.

కర్కాటకంలో శుక్రుడి కదలికతో లక్ష్మీ యోగం
కర్కాటకంలో శుక్రుడి కదలికతో లక్ష్మీ యోగం

వైదిక జ్యోతిష శాస్త్రంలో గ్రహాల కదలికలు పలు రాశుల జాతకులపై సానుకూల, ప్రతికూల ప్రభావం చూపుతాయి. గ్రహ సంచారాలు ఆయా రాశుల జాతకుల అదృష్టాన్ని మార్చేస్తాయి. ఇటీవల కర్కాటక రాశిలో శుక్ర సంచారం కారణంగా లక్ష్మీ యోగం ఏర్పడింది. ఇది శుభకరమైన పరిణామం. ఈ లక్ష్మీయోగం వల్ల పలు రాశులకు శుభం కలుగనుంది.

ట్రెండింగ్ వార్తలు

లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది?

శుక్రుడు ప్రేమ, శ్రేయస్సుల కారకుడు. 9, 10, 11వ ఇంటితో అనుకూలమైన అమరిక ఏర్పడినప్పుడు అది లక్ష్మీయోగానికి దారితీస్తుంది. 9వ ఇల్లు వృత్తిని, సామాజిక స్థితిని, 10వ ఇల్లు లాభాలు, కోరికలు తీరడాన్ని సూచిస్తుంది. శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు జాతకులకు ఆర్థిక లాభాలు, విజయాలతో జీవితం బాగుంటుంది. లక్ష్మీయోగం వల్ల సంపద వచ్చి చేరుతుంది. లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో వ్యక్తి జీవితం మెరుగవుతుంది.

జన్మ ఛార్టుల్లో లక్ష్మీ యోగం ఉన్న జాతకులు సంపదను పోగు చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థిరత్వాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. పని చేసే చోట మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక విలువలకు కట్టుబడి ఉంటారు. దీర్ఘకాలిక విజయాలకు ఇది బాట వేస్తుంది.

మే 30వ తేదీ రాత్రి 7.39 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ కారణంగా మకర రాశిలో లక్ష్మీయోగం ఏర్పడింది. ఈ యోగం ద్వారా 4 రాశులకు లక్ష్మీ దేవత శుభాశీస్సులు ప్రసరించనున్నాయి.

మేష రాశిపై లక్ష్మీ యోగం ప్రభావం

మేష రాశి జాతకులకు లక్ష్మీ యోగం వల్ల భూమి, ఇల్లు లేదా కారు వంటి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. వేతనం పెరుగుతుంది. కుటంబంలో సామరస్యం ఏర్పడుతుంది. జీవితం సంతృప్తిగా సాగుతుంది.

కర్కాటక రాశిపై లక్ష్మీ యోగం ప్రభావం

కర్కాటక రాశి జాతకులకు లక్ష్మీ యోగం వల్ల అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. తమ చుట్టూ ఉన్న వారిని బాగా ఆకట్టుకుంటారు. బలమైన నెట్ వర్క్ ఏర్పడుతుంది. వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వచ్చి చేరుతాయి. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతాయి.

కన్యా రాశిపై లక్ష్మీ యోగం ప్రభావం

లక్ష్మీ యోగంతో కన్యా రాశి వ్యక్తులకు దశ మారినట్టే. పెట్టుబడుల్లో గణనీయమైన లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరపడేందుకు బాటలు పడుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. పరస్పర అవగాహన ఉంటుంది. జీవితం సంతోషకరంగా సాగుతుంది.

మకర రాశిపై లక్ష్మీ యోగం ప్రభావం

మకర రాశిలో లక్ష్మీయోగం ఏర్పడడం వల్ల సంపదకు బాటలు పడ్డట్టే. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం గట్టిపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడుతాయి. ప్రతి పనీ విజయవంతం అవుతుంది.

WhatsApp channel