రాహు కేతువుల సంచారం.. ఏ రాశుల వారికి లాభము?
రాహు కేతువుల సంచారం వలన ఏయే రాశుల వారికి లాభం కలుగుతుందో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
30 అక్టోబర్ 2023 చిలకమర్తి పంచాంగరీత్యా, ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా రాహువు మేషరాశి నుండి మీనరాశిలోకి, కేతువు తులారాశి నుండి కన్యారాశిలోకి గోచారపరంగా మార్చు చెందుతున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
రాహువు, కేతువుల గ్రహస్థితిలో మార్పుల వలన మేష, వృషభ, మిథున రాశుల వారికి తులా, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతున్నాయని, అందులోను విశేషంగా గత కొంతకాలంగా ఇబ్బంది పడేటువంటి మేష మరియు తులారాశి వారికి విశేషమైన లాభములు కలుగుచున్నవని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రాహు, కేతువుల మార్చు వలన కన్యా, మీన రాశుల వారికి అలాగే సింహ, కుంభ రాశుల వారికి ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడు సూచనలు అధికముగా ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
మేషరాశి:
రాహు, కేతువుల గ్రహ మార్చు మేష రాశి వారికి కలసివచ్చును. ఆర్థిక అభివృద్ధి మరియు ప్రశాంతత లభించును.
వృషభ రాశి:
ఈ గ్రహ సంచారం వలన కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం పొందెదరు.
మిథున రాశి
మిథున రాశి వారు రాహు, కేతువుల మార్పు వలన ఉద్యోగములో పురోగతి పొందెదరు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు కుటుంబంలో ఏర్పడిన సమస్యలు రాహు, కేతువుల గ్రహ మార్పు వలన తొలగును.
సింహ రాశి
రాహు, కేతువుల గ్రహ మార్పు వలన ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా ఇబ్బందులు కలుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన.
కన్యారాశి
జన్మరాశి యందు కేతువు, కళత్రము నందు రాహువు ప్రభావం వలన ఒత్తిళ్ళు చికాకులు కలుగు సూచన.
తులారాశి
తులా రాశి జాతకులకు రాహు, కేతువుల గ్రహ మార్పు వలన అనుకున్న పనులు పూర్తి చేసెదరు. శత్రువులపై విజయాన్ని పొందెదరు.
వృశ్చిక రాశి
రాహు, కేతువుల గ్రహ మార్చు వలన సంతాన సౌఖ్యము, లాభము పొందెదరు.
ధనూ రాశి
ధనూ రాశి జాతకులకు రాహు, కేతువుల గ్రహ మార్పు వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలుగును.
మకర రాశి
రాహు, కేతువుల గ్రహ మార్పు వలన మకర రాశి జాతకులకు గత కొంతకాలముగా ఉన్న సమస్యలు పరిష్కారం అగును.
కుంభ రాశి
రాహు, కేతువుల గ్రహ సంచారం వలన కుంభ రాశి వారికి అష్టమ స్థానము, ఆయుః స్థానములో కేతువు ప్రభావం చేత అనారోగ్య సమస్యలు వేధించును. వాక్ స్థానములో రాహువు ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన ఇబ్బందులు కలుగును.
మీన రాశి
రాహు, కేతువుల గ్రహ మార్చు వలన జన్మ రాహువు ప్రభావం చేత మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు కలుగును. కళత్ర స్థానమునందు కేతువు ప్రభావంచేత కుటుంబములో వివాదాలు, సమస్యలు కలుగు సూచన.
పరిహారం
ఈ ఫలితాల ప్రకారం రాహు కేతువు చెడు ప్రభావాలు ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యున్ని, దుర్గాదేవిని ఆరాధించుట వలన కొంత చెడు ఫలితాలు తగ్గునని చిలకమర్తి తెలిపారు.