House Construction: 2025లో ఈ రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది, ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి!
గృహ నిర్మాణం 2025: 2024 సంవత్సరంలో శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల కొంతమంది సొంతింటి కలను ఇంకా సాకారం చేసుకోలేకపోయారు. 2025 రాబోతోంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సారి కొన్ని రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది, ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి!
ఇల్లు కట్టండి, పెళ్లి చేయండి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండు అంత సులువుగా జరిగే పనులు కావని అర్థం. కొంతమంది జీవితాంతం కష్టపడినా స్థలం కొనలేరు. కల కన్నట్లుగా ఇల్లు కట్టుకోలేరు. దీనికి గ్రహాల కదలికలు కూడా కారణం కావచ్చు.కొన్నిసార్లు ఎంత డబ్బు ఉన్నా గ్రహాల కదలికల మద్దతు లేకుండా అనుకున్నది సాధించలేరు. సొంతింటి కల నెరవేర్చుకోలేరు. 2024 సంవత్సరంలో శని, రాహువు, కేతు గ్రహాల కారణంగా చాలా మంది సొంతింటిని నిర్మించుకోలేకపోయారు. కానీ 2024 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. కనీసం ఈ ఏడాదైనా భూమి కొంటామా, ఇల్లు కొంటామా లేదా కట్టుకుంటామా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలను బట్టి కొన్ని రాశుల వారి సొంతింటి కల నెరవేరబోతుంది. ఆ రాశులేవో.. అందులో మీ రాశి ఉందో లేదో చూద్దాం రండి.
మేష రాశి:
ఈ రాశి వారికి ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి 2025 మంచి సమయం ఉంది. 2025 మధ్యస్థ స్థాయిలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇప్పటికే కొంత భూమిని కలిగి ఉంటే, దానిపై మీ ఇంటిని నిర్మించాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం. ఇంటి నిర్మాణం విషయంలో మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మీరు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే ఈ సంవత్సరం మీ సొంతింటిని నిర్మించడంలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి నుండి మార్చి వరకు శని ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శనిదేవుడు మీకు ఇల్లు, ఆస్తి పరంగా సమస్యలను కలిగిస్తాడు. అందువల్ల, మీరు ఈ సంవత్సరం ఏదైనా భూమిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిది. వివాదాస్పద భూమిని కొనుగోలు చేయడం మీ సమస్యలను పెంచుతుంది. మొత్తం మీద, ఇల్లు కొనడం లేదా ఇల్లు నిర్మించే విషయంలో 2025 సంవత్సరం మీకు అనుకూలంగా లేదు. కానీ ఈ సమయంలో మీరు ఇంటిని మరమ్మత్తు చేయవచ్చు లేదా పునరుద్ధరించవచ్చు.
మిథున రాశి:
మిథున రాశి వారికి 2025 ఏడాది ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఒక మోస్తరు ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో, అంటే జనవరి నుండి మే వరకు మీపై రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు భూమి లేదా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినా సరే, వివాదాస్పద ఆస్తిని కొనుగోలు చేయకుండా ఉండండి. శని మీకు మే నెల తరువాత సానుకూల ఫలితాలను ఇస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి 2025 లో సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనడానికి లేదా భూమికి సంబంధించిన విషయాలకు మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు స్థలాన్ని లేదా ఇంటిని స్వంతం చేసుకోవాలనుకుంటే మీ మార్గంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మీ కృషి, కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. మీరు పుట్టిన ప్రదేశానికి దూరంగా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే లేదా అటువంటి ప్రదేశంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మే నెల మధ్యలో వచ్చే సమయం శుభప్రదం.