Touching parents feet: నిద్రలేచిన తర్వాత తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఇన్ని బాధలు పోతాయట
Touching parents feet: తల్లిదండ్రులని గౌరవించడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని, పెద్దల్ని గౌరవించాలి. అలా గౌరవించడం వలన ఇబ్బందులు ఉండవు. అప్పుడే పిల్లలు వృద్ధి చెందుతారు. లేచిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారు. అలా చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ కూడా రోజంతా మంచి జరగాలని.. అనుకున్న పనులు పూర్తి అవ్వాలని అనుకుంటారు. అందుకోసం లేచిన వెంటనే ఇష్ట దైవాన్ని ప్రార్థించడం, లేదంటే అరచేతుల్ని చూసుకోవడం, భూదేవికి నమస్కారం చేయడం లేదంటే తల్లిదండ్రులకి నమస్కారం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే, లేచిన వెంటనే చాలా మంది తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు. లేచిన వెంటనే తల్లిదండ్రులకు దండం పెట్టడం వలన ఎంత గొప్ప ఫలితం అందుకోవచ్చు మీకు తెలుసా?
తల్లిదండ్రులని గౌరవించడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని, పెద్దల్ని గౌరవించాలి. అలా గౌరవించడం వలన ఇబ్బందులు ఉండవు. సంతోషంగా జీవించవచ్చు. తల్లిదండ్రుల అనుగ్రహం పిల్లలకి ఎప్పుడూ ఉండాలి. అప్పుడే పిల్లలు వృద్ధి చెందుతారు. అయితే లేచిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారు. అలా చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
లేచిన వెంటనే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయడం వలన ఏమవుతుంది?
సానుకూల శక్తి
లేచిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కారం చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే లేచిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు.
బ్లడ్ సర్కులేషన్
రక్త ప్రవాహం బాగా జరగడానికి ఇది సహాయపడుతుంది. తల్లిదండ్రుల పాదాలను పిల్లలు తాకినప్పుడు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. పై భాగాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. చర్మ సమస్యలు, జుట్టుకి సంబంధించిన సమస్యలు రావు.
గ్రహ దోషాలు
జ్యోతిష్యం ప్రకారం తండ్రి పాదాలను తాకితే గ్రహ దోషాలు తొలగిపోతాయట. పిల్లలు తండ్రి పాదాన్ని తాగితే సూర్యుడు జాతకంలో బలపడతాడు. అమ్మమ్మ, అమ్మ, అత్త పాదాలని తాకితే చంద్రగ్రహణం బలపడుతుంది. సోదరి, అత్త పాదాలని తాకితే బుధుడు బలపడతాడు. గురువులు, సాధువులు, బ్రాహ్మణుల పాదాలని తాగితే బృహస్పతి గ్రహం బలపడుతుంది.
తల్లిదండ్రుల పాదాలకు ఎలా నమస్కారం చేయాలి?
ముందు సరిగ్గా వంగి ఆ తర్వాత తల్లితండ్రుల కాళ్ల వేళ్ళను తాకలి.
ఇంకో పద్ధతి ఏంటంటే ముందు మోకాళ్ళ మీద కూర్చుని వంగి నమస్కారం చేయాలి. ఇలా చేయడం వలన అన్ని ఎముకలు స్ట్రెచ్ అవుతాయి. నొప్పులు సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం