Most Beautiful Women: హిందూ పురాణాల్లో అతి సుందరమైన మహిళలు వీరే!
Most Beautiful Women: హిందూ పురాణాల ప్రకారం, అందమైన మహిళలు అనేక మంది ఉన్నారు. కానీ, కొద్ది మంది మాత్రమే వారి తెలివి, ధైర్యం, జ్ఞానంతో ప్రఖ్యాతి చెందారు. ఈ మహిళలు తాము చేసిన పనులతో పాటు వారి త్యాగంతోనూ పురాణాలలో చిరస్మరణీయులుగా నిలిచారు.
పురాణాల్లోనే కాదు చరిత్రలోనూ అందమైన మహిళల చుట్టూ అతిపెద్ద యుద్ధాలే కనిపిస్తాయి. తరచుగా ఇరు వ్యక్తులు, ఇరు కుటుంబాలు, ఇరు దేశాలు ఈ అందమైన మహిళల కోసం సమయాన్ని, ఆస్తిని, బలాన్ని నష్టపరచుకున్న సందర్భాలున్నాయి. అత్యంత ఆదరణీయమైన, మర్యాదపూర్వకంగా నడుచుకున్న ఆ స్త్రీలు ప్రపంచపు గతులను మార్చగలిగారు. గ్రీకు పురాణంలో హెలెన్ ఆఫ్ ట్రాయ్, హెబ్రూ పురాణంలో డెలైలా, నార్స్ పురాణంలో ఫ్రేయా, అరేబియన్ పురాణంలో షెహెరజాద్ లు అందమైన మహిళలుగా ప్రఖ్యాతులయ్యారు.మరి హిందూ పురాణల్లో అందమైన మహిళలు ఎవరు? తెలివితో, జ్ఞానంతో , ధైర్యంతో ప్రసిద్ది చెందిన ఆ స్త్రీల గురించి తెలుసుకుందాం.
మోహిని
హిందూ పురాణం ప్రకారం, అత్యంత అందమైన మహిళల్లో ప్రధానంగా చెప్పేది మోహిని. శ్రీమహా విష్ణువు ప్రత్యేక కారణంతో మహిళ అవతారమెత్తి అమృతాన్ని పంచడానికి భువిపైకి దిగి వచ్చాడట. ఆత్రుతలో ఉన్న అసురులను మోహించి, విశ్వవిజయం సాధించడానికి ఒక అందమైన మహిళగా మారి, అసురుల దృష్టిని మరల్చగలిగారట. మోహిని ఎంత అందమైన మహిళ అంటే, సాక్షాత్ ఆ పరమశివుడే ఆమె మైకంలో పడిపోయాడట.
అహల్య
అహల్య అనే మహిళ సాధారణ జననంతో భూమిపైకి రాలేదు. తనకు మించి మరెవరు నృత్యం చేయలేరని, అహంభావం పెంచుకున్న అప్సరసకు బుద్ధి చెప్పాలని బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించాడట. ఆమె శుద్ధమైన సృజనాత్మక శక్తితో నిర్మించబడింది. మహారి నృత్య సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ఆమెను నీటి ద్వారా రూపొందించాడు. ఆమె అందం చూసి ఇంద్రుడు కూడా ఆకర్షితుడయ్యాడట.
తిలోత్తమా
పురాణం ప్రకారం, బ్రహ్మ అందంతో మాయ చేయగల మహిళలను సృష్టించాడు. అందులో ఒకరు ఈ తిలోత్తమా. ఆమె పేరు ప్రకారం, ఆమె ప్రతి భాగం అతి సుందరమైనదట.
ఊర్వశి
ఊర్వశి అనేది ఒక దేవకన్య పేరు. ఒకానొక సందర్భంలో నారాయణుడు తొడ భాగం నుంచి ఉద్భవించిన స్త్రీ ఊర్వశి. దేవేంద్రుడి సభలోని స్త్రీలందరికంటే అతి సుందరమైన మహిళ. అపారమైన అందాన్ని వర్ణించే సందర్భంలో ఊర్వశితో పోల్చి చెప్తుంటారు.
మండోదరి
రావణుని భార్యయైన మండోదరి అందంలోనూ, కీర్తిలోనూ, నిజాయతీలోనూ ప్రత్యేకత ఉన్న మహిళ. సీతాదేవి కోసం అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు సీతాదేవి అందం గురించి విని ఉండటంతో, అతి సుందరమైన మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమించాడట.
ధమయంతి
విధర్భ రాజ్యపు రాజకుమారి ధమయంతి. ఆమె అందం గొప్పది. దేవతలు కూడా అసూయపడే అందం కల స్త్రీ. ఈమె స్వయంవర పోటీలో ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు కూడా పాల్గొన్నారు.
రుక్మిణి
మహాభారతంలోని అతి సుందరమైన మహిళలలో రుక్మిణి కూడా ఒకరు. ఆమెను లక్ష్మి దేవి అవతారంగా చెబుతారు. శ్రీకృష్ణుడు ఈమెను వివాహం చేసుకున్నాడు.
ద్రౌపది
మహాభారతం ప్రకారం, రెండవ అత్యంత అందమైన మహిళ అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది. ఈమె తెలివిలో కూడా తక్కవేం కాదని పురణాలు చెబుతున్నాయి.
సీత
రామాయణం ప్రకారం, మానుష్య రూపంలో భువిపైకి వచ్చిన లక్ష్మీదేవి అవతారం సీతాదేవి. రాజకుమారిగా ఉన్న సీతాదేవిని రాముడు వివాహమాడగా, ఆమె అందాన్ని లోబరుచుకోవాలనే దురుద్దేశంతో రావణుడు ఆమెను అపహరించుకుపోయాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.