Saraswati Temples: వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే భారతదేశంలో ఉన్న 9 ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలేవో చూడండి-top 9 famous saraswati temples in india where aksharabyasam can be done for kids on vasantha panchami check details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saraswati Temples: వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే భారతదేశంలో ఉన్న 9 ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలేవో చూడండి

Saraswati Temples: వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే భారతదేశంలో ఉన్న 9 ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలేవో చూడండి

Peddinti Sravya HT Telugu
Jan 25, 2025 12:00 PM IST

Saraswati Temples: మేధా, ప్రతిభ, ఆలోచన, ధారణ, ప్రజ్ఞ స్వరూపం సరస్వతి దేవి. భారతదేశంలో చాలా సరస్వతి దేవి ఆలయాలు ఉన్నాయి. ప్రముఖ ఆలయాలు గురించి ఇప్పుడు చూద్దాం.

Saraswati Temples: వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే భారతదేశంలో ఉన్న 9 ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలేవో చూడండి
Saraswati Temples: వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే భారతదేశంలో ఉన్న 9 ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలేవో చూడండి (pinterest)

సరస్వతీ దేవి గురించి వివిధ గాధలు ఋగ్వేదంలో, దేవీ భాగవతంలో ఉన్నాయి. అలాగే బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా సరస్వతి దేవి గురించి గాధలు ఉన్నాయి. సరస్వతి దేవి వాక్, బుద్ధి, వివేకం, కలలు, విజ్ఞానం, విద్య వీటన్నిటికీ అధిదేవతగా పూజిస్తారు. పరాశక్తి మొదటి ధరించిన ఐదు రూపాయల్లో సరస్వతి కూడా ఒకటి.

సంబంధిత ఫోటోలు

కేవలం చదువుకే కాదు సర్వ శక్తి సామర్థ్యాలను భక్తులకు ప్రసాదిస్తుంది. సరస్వతి దేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆమెని హంస వాహిని, వాగేశ్వర, కౌమారి, భారతి, భువనేశ్వరి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతి దేవిని ప్రముఖంగా ఆరాధించడం జరుగుతుంది.

వసంత పంచమి

ప్రతీ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. దీనినే మదన పంచమి అని కూడా అంటాము. ఈ పండుగ యావత్ భారత దేశంలో జరుగుతుంది. వసంత పంచమి నాడు చిన్నా, పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ముందు పెట్టి ఆరాధిస్తారు.

సంగీతం, నృత్య, సాహిత్యాలకు కూడా ఈమె మూలం. సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులవుతారని నమ్ముతారు. మేధా, ప్రతిభ, ఆలోచన, ధారణ, ప్రజ్ఞ స్వరూపం సరస్వతి దేవి. భారతదేశంలో చాలా సరస్వతి దేవి ఆలయాలు ఉన్నాయి. ప్రముఖ ఆలయాలు గురించి ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలు

1.అరుల్మిగు సరస్వతి ఆలయం కూతనూర్, తిరువారూర్, తమిళనాడు

అక్షరాభ్యాసానికి నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. విజయదశమి రోజున అమ్మవారిని హంసపై ఊరేగించి, అనేక నైవేద్యాలు సమర్పిస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా పుస్తకాలు, పెన్నులు తీసుకువచ్చి దేవత పాదాలపై పెడతారు.

2. జ్ఞాన సరస్వతి ఆలయం, బాసర, తెలంగాణ

ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చెందినది. ఈ ఆలయం సరస్వతీ దేవికి అంకితం చేయబడింది. అక్షరాభ్యాసం కోసం ఇక్కడకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ వుంటారు. నవరాత్రుల సమయంలో, వసంత పంచమి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

3. శారదా పీఠం, శృంగేరి, కర్ణాటక

ఆది శంకరాచార్యతో అనుబంధించబడిన పీఠములలో ఇది కూడా ఒకటి. కర్ణాటక తీరంలో, నవరాత్రుల తొమ్మిది రోజులలో పూజలు, ప్రత్యేక నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థిస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేయించుకుంటారు.

4. విద్యా సరస్వతి ఆలయం, వర్గల్, తెలంగాణ

ఈ ఆలయంలోని సరస్వతీ దేవి విద్యను అనుగ్రహిస్తుందని భక్తులు నమ్మకం. పండితుడు, యమవరం చంద్రశేఖర శర్మ కృషి కారణంగా ఈ ఆలయ నిర్మాణం నిర్మించబడింది. ఇది శని దేవుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇక్కడ, వసంత పంచమి, నవరాత్రుల రోజుల్లో అక్షరాభ్యాసం వేడుకతో సహా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

5. శ్రీ మూకాంబిక దేవాలయం కొల్లూరు, కర్ణాటక

మూకాంబిక దేవతకి అంకితం చేయబడిన ఈ ప్రసిద్ధ ఆలయం మంగళూరు నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి కూడా చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు.

6. త్రిక్కవు శ్రీ దుర్గాభగవతి ఆలయం, మలప్పురం, కేరళ

ఇది ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం కూడా చేస్తారు. పురాణాల ప్రకారం, ఈ పురాతన ఆలయాన్ని పరశురాముడు నిర్మించిన 108 దుర్గా క్షేత్రాలలో ఒకటి.

7. సరస్వతీ దేవి శక్తిపీఠం, జమ్మూ అండ్ కాశ్మీర్

జమ్మూ అండ్ కాశ్మీర్ లో సరస్వతీ దేవి శక్తిపీఠం ఉంది. 18 మహా శక్తి పీఠాల్లో ఈ శక్తిపీఠం ఒకటి. ఇక్కడకు కూడా చాలామంది భక్తులు వచ్చి సరస్వతి దేవిని భక్త శ్రద్ధలతో ఆరాధిస్తారు.

8. కాలేశ్వరం మహా సరస్వతి ఆలయం

భూపాల్ పల్లి జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అక్షరాభ్యాసం వంటి వేడుకలని ఇక్కడ జరిపించుకుంటారు.

9. జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, విజయనగరం

ఈ ఆలయంలో సరస్వతి దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కూడా చాలామంది భక్తులు అక్షరాభ్యాసం వేడుకని జరుపుతారు. దసరా నవరాత్రుల్లో కూడా ఇక్కడ విశేష పూజలు జరుపుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం