Phalguna masam: ఫాల్గుణ మాసం.. ఈ నాలుగు రాశుల వారికి నెల రోజులు పట్టిందల్లా బంగారమే!
Phalguna masam: మహా విష్ణువుకి ఇష్టమైన మాసం ఫాల్గుణ మాసం. మార్చి 11 నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ నాలుగు రాశుల వారికి నెల రోజులు పట్టిందల్లా బంగారం కాబోతుంది.
Phalguna masam: మాఘ మాసం తర్వాత వచ్చేది ఫాల్గుణ మాసం. మార్చి 11 నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం కాబోతుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇది. ఈ సమయంలో చేసే దానధర్మాలకు విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువును పూజిస్తూ దానాలు చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టు చెబుతారు. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవితో పాటు విష్ణువుని పూజించడం వల్ల ఎంతో పుణ్యఫలం దగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఫాల్గుణ మాసం శీతాకాలం ముగింపు వేసవికాలం ప్రారంభాన్ని కూడా ఇది సూచిస్తుంది. సనాతన ధర్మంలో ఈ మాసం ప్రధాన ఉపవాసాల పండుగల మాసం. అది మాత్రమే కాకుండా చాలా పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి.
నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు రాశులని మారుస్తూ పయనిస్తాయి. గ్రహాల రాశి చక్ర మార్పులు అన్ని రాశులపై శుభ ,అశుభ ప్రభావాలు చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం ఫాల్గుణ మాసం కొన్ని రాశులకు ఎంతో ప్రీతికరంగా నిలవబోతోంది. రానున్న 30 రోజులు ఈ రాశుల వారికి అదృష్టం సంపూర్ణ మద్దతు లభిస్తుంది.ఆదాయం పెరిగి ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు. ఏయే రాశుల వారికి ఫాల్గుణ మాసం సంపదని ఇవ్వబోతుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి జాతకులకు ఫాల్గుణ మాసం అదృష్టాన్ని ఇవ్వనుంది. ఈ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. పని చేసే ప్రదేశంలో మీ గౌరవం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి
వచ్చే నెలరోజులు మిథున రాశి వారికి ఆదాయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చేసే ప్రతి పనికి ప్రశంసల లభిస్తాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో గౌరవం పొందుతారు. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది.
సింహం
ఫాల్గుణ మాసం సింహ రాశి జాతకులకు వరం లాంటిది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారు ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు సమసిపోతాయి. ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం పెరగటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం మీకు ఆనందాన్నిస్తుంది.
కన్యా రాశి
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఫాల్గుణ మాసంలో కొత్త పనులు ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుంది. కన్యా రాశి జాతకులు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది అనువైన సమయం. వ్యాపారులు లాభాలు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సంపద పెరగటంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యా, మేధోపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు లభిస్తాయి.