ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, ఇంకొకటి శుక్లపక్షంలో. హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండడం వలన ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు.
12 రాశుల వారిపై ఈ యోగం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టంతో పాటు అనేక లాభాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి వారికి నిర్జల ఏకాదశి నాడు అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది. మకర రాశి వారు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టు కేసుల నుంచి విజయాన్ని పొందుతారు. గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి.
సింహ రాశి వారికి కుబేర యోగం కారణంగా రాజకీయాల్లో కీలక పదవులు వస్తాయి. కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వదిలేసిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. వ్యాపారులకు కూడా మంచి లాభం ఉంటుంది.
కన్యా రాశి వారికి నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగంతో లాభం కలుగుతుంది. పెళ్లి కుదరని వాళ్లకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఈ యోగం కారణంగా సోదరులతో సఖ్యత ఉంటుంది. లాటరీలు కూడా ఈ సమయంలో తగిలే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.