Sita navami 2024: రేపే సీతానవమి.. భార్యాభర్తలు ఇలా చేశారంటే మీ జీవితం కలకాలం సంతోషమయమే
Sita navami 2024: సీతా నవమి మే 16వ తేదీ జరుపుకుంటారు. ఈరోజు భార్యాభర్తలు ఉపవాసం ఉంది కొన్ని పరిహారాలు పాటించడం వల్ల వారి కాపురం కలహాలు లేకుండా కలకాలం సాగుతుంది.
Sita navami 2024: ప్రతి సంవత్సరం వైశాఖమాసం నవమి తేదీన సీతా నవమి జరుపుకుంటారు. ఈ ఏడాది మే 16వ తేదీ సీతా నవమి వచ్చింది. ఈ రోజున జానకి నవమి అని కూడా పిలుస్తారు
సీతా నవమి రోజు సీతాదేవి జన్మించిందని ప్రతీతి. త్యాగానికి, అంకిత భావానికి, భర్త అడుగుజాడల్లో నడిచిన స్త్రీగా ఆదర్శవంతమైన ఇల్లాలుగా నిలిచింది. ఈ పవిత్రమైన రోజున సీతా మాతని ప్రసన్నం చేసుకోవడానికి సీతా చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల సీతమ్మ అనుగ్రహం మీకు లభిస్తుంది.
సీతానవమి శుభ ముహూర్తం
నవమి తిథి మే 16 ఉదయం 6. 22 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తిథి ముగింపు మే 17 ఉదయం 8. 48 గంటల వరకు.
పవిత్రమైన ఈరోజు సీతారాముల వారికి భార్యాభర్తలు పూజ చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల 16 మహా ధార్మిక ఫలాలు లభిస్తాయి అని చెబుతారు.
పూజా విధానం
ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని గంగాజలం చల్లి శుభ్రం చేయాలి. అలాగే దీపం వెలిగించాలి. గంగాజలంతో దేవతలందరికీ అభిషేకం చేయాలి. సీతారాముల వారిని పూజించాలి. నైవేద్యాలు సమర్పించి సీతాదేవిని ధ్యానించాలి. సీతాదేవి మంత్రాలు పఠించాలి. సీతా నామాన్ని శ్రీరాముడు నామాన్ని జపించడం వల్ల మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ పర్వదినాన సీతా దేవిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలనుంచి లభిస్తుంది. ధన కొరత తొలిగిపోయి భక్తులకు తీరని అదృష్టం లభిస్తుంది. సీతా నవమి రోజు రామాయణాన్ని పారాయణం చేయడం చాలా మంచిది.
వైవాహిక జీవితం సంతోషం కోసం
భార్యాభర్తలు తమ వైవాహిక జీవితం మధురంగా ఉండేందుకు సీతా నవమి రోజు సీతారాములను పూజించాలి. తల్లికి 16 మేకప్ వస్తువులు సమర్పించాలి. అలాగే సంతోషం, శ్రేయస్సు పెరిగేలా చేయమని కోరుతూ సీతా చాలీసా, జానకి స్తోత్రాన్ని పఠించాలి. ఈ వస్తువులు పెళ్ళైన వారికి దానం చేయడం కూడా మంచిది.
సీతా నవమి రోజు సీతా చాలీసా పఠించడం చాలా ముఖ్యం. దీన్ని జపించడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య సామరస్య పూర్వకమైన వాతావరణం నెలకొంటుంది.
సీతాదేవికి ఖీర్ సమర్పించాలి. అలాగే దానిని ఏడుగురు బాలికలకు పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
వివిధ కారణాల వల్ల వివాహం వాయిదా పడుతూ వస్తున్న అమ్మాయిలు సీతా నవమి రోజు పూజ చేయాలి. జానకి స్తుతిని పఠించడం వల్ల జాతకంలో ఉన్న అననుకూల గ్రహాలు తొలగిపోతాయి. పెళ్ళికి ఎటువంటి ఆటంకం లేకుండా మార్గం సుగమం అవుతుంది. త్వరగా వివాహం జరుగుతుంది.
సీతా నవమి రోజు జంతువులకు, పక్షులకు తాగునీరు ఏర్పాటు చేయాలి. అలాగే గోమాతకు ఆహారం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరికలు అన్నీ నెరవేరుతాయి.
సీతా నవమి కథ
సీతాదేవిని లక్ష్మీ అవతారంగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి భూమిపై అవతరించిన రోజున సీతానవమిగా పిలుస్తారని ప్రస్తావించారు. జనకమహారాజు కుమార్తెగా సీతాదేవి గురించి చెప్తారు.
ఒకనాడు మిథిలా నగరంలో తీవ్రమైన కరువు పరిస్థితి ఉండేది. దీని కారణంగా మిథిలా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆకలితో అలమటించారు. దీంతో జనక మహారాజు కలత చెందాడు. కరువు నివారణ కోసం యజ్ఞం చేయమని రుషులు సూచించారు. ఆ విధంగా యజ్ఞం చేసి భూమిని దున్నుతున్న సమయంలో నాగలికి ఒక పెట్టే తగిలింది. దాన్ని తెరిచి చూడగా అందులో పాప కనిపించింది. జనక మహారాజుకు సంతానం లేదు. దీంతో ఆమెను జనకమహారాజు కూతురుగా దత్తత తీసుకున్నాడు. ఆమెకు సీతాదేవిగా నామకరణం చేశాడు. జనక మహారాజు చేసిన యజ్ఞం ఫలించి మిథిలా నగరంలో ఎప్పుడూ కరువు పరిస్థితి రాలేదు.