Nirjala ekadashi 2024: రేపే నిర్జల ఏకాదశి.. పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, ఉపవాసం విధానం తెలుసుకోండి-tomorrow june 18th nirjala ekadashi shubha smayama puja vidhanam fasting rules ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nirjala Ekadashi 2024: రేపే నిర్జల ఏకాదశి.. పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, ఉపవాసం విధానం తెలుసుకోండి

Nirjala ekadashi 2024: రేపే నిర్జల ఏకాదశి.. పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, ఉపవాసం విధానం తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Jun 17, 2024 04:35 PM IST

Nirjala ekadashi 2024: పవిత్రమైన అత్యంత కష్టమైన నిర్జల ఏకాదశి జూన్ 18న వచ్చింది. ఈ ఏకాదశి ప్రాముఖ్యత, పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, ఉపవాస విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

నిర్జల ఏకాదశి వ్రతం 2024
నిర్జల ఏకాదశి వ్రతం 2024

Nirjala ekadashi 2024: అత్యంత కష్టతరమైన, అనంతమైన పుణ్య ఫలితాలను ఇచ్చేది నిర్జల ఏకాదశి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూర్ణ క్రతువులతో పూజిస్తారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి నాడు 3 శుభ యోగాలు కలగడం వల్ల భక్తులకు శ్రీమహావిష్ణువు విశేష ఆశీస్సులు లభిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి.

ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా పరిగణస్తారు. ఇది సంవత్సరం మొత్తం ఏకాదశులలోని వ్రతం కంటే ఉత్తమంగా భావిస్తారు. ఈ ఉపవాసం ఆచరిస్తే 24 ఏకాదశుల ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ ఏడాది నిర్జల ఏకాదశి గురించి చాలా మందిలో సందేహం నెలకొంది. అందుకు కారణం ఏకాదశి తిథి రెండు రోజులు ఉంది. కొంతమంది జూన్ 17న జరుపుకుంటే మరికొందరు జూన్ 18వ తేదీ జరుపుకోబోతున్నారు. అయితే జూన్ 18న నిర్జల ఏకాదశి జరుపుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. నిర్జల ఏకాదశి పవిత్ర సమయం, పూజా విధానం, మంత్రం , ఉపవాసం సమయం గురించి తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి శుభ సమయం

నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం – జూన్ 17, 2024 ఉదయం 04:43 గంటలకు

నిర్జల ఏకాదశి తేదీ ముగుస్తుంది - జూన్ 18, 2024 ఉదయం 06:24 గంటలకు

జూన్ 19న పరానా (ఉపవాస విరమణ) సమయం - 05:24 AM నుండి 07:28 AM వరకు

మూడు శుభ యోగాలు

ఈ సారి నిర్జల ఏకాదశి నాడు మూడు శుభకార్యాలు జరుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఈ రోజున త్రిపుష్కర యోగం, శివయోగం, స్వాతి నక్షత్రాల ప్రత్యేక కలయిక జరుగుతోంది. ఈ కలయికలు శ్రేయస్సు పెరుగుదలకు కారకాలుగా పరిగణిస్తారు.

ఈ వ్రతము వలన మనిషి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. దీనితో పాటు, వ్యక్తి కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సాధకుడు మరణానంతరం వైకుంఠ ధామాన్ని పొందుతాడని సనాతన గ్రంథాలలో ఉంది.

పూజా విధానం

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పీట ఏర్పాటు చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామి వారికి అభిషేకం చేయాలి. పసుపు చందనం, పసుపు పూలు దేవుడికి సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించాలి. ఉపవాసం ఉంటామని నిశ్చయించుకోవాలి. తర్వాత నిర్జల ఏకాదశి వ్రత కథను పఠించాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. తులసితో చేసిన భోగాలు దేవుడికి సమర్పించాలి. చివరిగా భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి.

ఉపవాస విధానం

నిర్జల ఏకాదశి రోజు ముఖ్యంగా పాటించాల్సిన నియమం నీరు తాగాకుండ ఉండటం. అందుకే దీన్ని అత్యంత కష్టమైనదిగా చెప్తారు. ఏకాదశి ఉపవాసం ఆచరించినా, ఆచరించకపోయినా ఈరోజు అన్నం తినడం నిషేధం. ఎందుకంటే సకల పాపాలు ధాన్యాలతో ఉంటాయని ఏకాదశి రోజు వీటిని తీసుకుంటే శరీరంలోకి చేరిపోతాయని చెప్తారు. ఉపవాసం పూర్తి అయ్యే వరకు మంచి నీళ్ళు తీసుకోకూడదు. మరుసటి రోజు బ్రహ్మణుడిని పిలిచి అన్నదానం చేసి, దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలి.

నిర్జల ఏకాదశి రోజు ఏం దానం చేయాలి?

సనాతన ధర్మంలో ఒక సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో అత్యంత కష్టతరమైన ఏకాదశి ఉపవాసం ఇది. నిర్జల ఏకాదశిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల వ్యక్తి అన్ని ఏకాదశులతో సమానమైన ఫలితాలను పొందుతాడు. దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు.

ఈ ఏకాదశిలో పూజతో పాటు దానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఏకాదశి రోజున నీళ్లు నింపిన కుండను దానం చేయడం ఉత్తమం. ఫ్యాన్, చెప్పులు, బట్టలు తదితరాలను దానం చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు. ఈ రోజున మంచినీటి దానంతో పాటు జల కుంభ దానంకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి నాడు చాలా పవిత్రమైన యాదృచ్ఛికం జరగబోతోంది. అలాంటి యాదృచ్చికం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ ఏకాదశి రోజున చిత్తా, స్వాతి నక్షత్రాలతో శివ,రవి యోగాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

WhatsApp channel