Shani Amavasya: రేపే శని అమావాస్య.. ఈ 4 పరిహారాలను పాటిస్తే.. లక్ష్మీదేవి, శనీశ్వరుడి ఆశీస్సులు కలిగి, సంపద పెరుగుతుంది!
Shani Amavasya: శని అమావాస్య మార్చి 29న జరుపుకోవాలి. అమావాస్య నాడు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు కొన్ని నివారణలు చేయడం వలన శని దేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు.
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే అమావాస్య మార్చి 28 రాత్రి 7:55 గంటలకి మొదలవుతుంది . మార్చి 29 సాయంత్రం 4.07 తో ముగుస్తుంది. ఈ ప్రకారం, శని అమావాస్య మార్చి 29న జరుపుకోవాలి. అమావాస్య నాడు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ప్రత్యేకమైనది.
ఈరోజు కొన్ని నివారణలు చేయడం వలన శని దేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు. సంపద పెరుగుతుంది. మరి శని అమావాస్య నాడు పాటించాల్సిన పరిహారాలు గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
శని అమావాస్య నాడు ఈ పరిహారాలని పాటించవచ్చు
1.నువ్వుల నూనెను సమర్పించండి
శని దేవుడు అనుగ్రహం కలగడానికి శని అమావాస్య నాడు శని దేవునికి నువ్వుల నూనెను సమర్పించాలి. నువ్వుల నూనెను శని దేవుడికి సమర్పించేటప్పుడు 'ఓం శం శనైశ్చరాయ నమః ' మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఇలా చేయడం వలన శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అదే విధంగా ఈరోజు నువ్వుల నూనెతో శనీశ్వరుడికి దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
2.లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి
శని అమావాస్యనాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి నల్ల నువ్వులు, మినప్పప్పు, ఇనుముని దానం చేస్తే మంచిది. బెల్లం పిండితో ఉండలు చేసి చీమలకు తినిపిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై సంపద పెరుగుతుంది. అలాగే ఈరోజు శని దోష ప్రభావం నుంచి బయటపడడానికి గోధుమపిండి బెల్లంతో చేసిన ఉండలని చేపలకు వేస్తే మంచిది .
3.శని అమావాస్యనాడు దీపారాధన
శని అమావాస్యనాడు దీపారాధనకి కూడా ఎంతో విశిష్టత ఉంది. అమావాస్యనాడు సాయంత్రం పూట దీపారాధన చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజు ముఖద్వారం ఎడమవైపు, రావి చెట్టు కింద, శివాలయంలో, ఇంటి దక్షిణ దిశలో దీపారాధన చేయడం మంచిది.
ఇలా దీపారాధన చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. వారి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం, శనీశ్వరుడి అనుగ్రహాన్ని కూడా ఇలా చేయడం వలన పొందడానికి అవుతుంది.
4.తర్పణాలు
శని అమావాస్య నాడు, పవిత్ర నదిలో స్నానం చేయండి. ఈ రోజున తర్పణాలు వదిలితే పూర్వీకుల ఆశీర్వాదం పొందుతారు. శని దేవునికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టండి, పేదలకు ఆహారం పెట్టండి. ఆవు, కాకి, కుక్కలకు ఆహారం పెడితే పూర్వీకులు సంతోషిస్తారు. శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం