Naga panchami 2024: రేపే నాగ పంచమి.. పూజకు శుభ ముహూర్తం, పఠించాల్సిన మంత్రాలు తెలుసుకుందాం
Naga panchami 2024: నాగ పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించడం శుభ ఫలితాలను తెస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
Naga panchami 2024: హిందూ మతంలో నాగ పంచమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి 09 ఆగస్ట్ 2024 శుక్రవారం వచ్చింది. విశేషమేమిటంటే నాగ పంచమి రోజున ఏర్పడిన సధ్య, సిద్ధ యోగాలు ఈ రోజు ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. ఈ యోగాలు, నాగ పంచమి పూజ జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
సత్య, సిద్ధ యోగాల కలయిక
జ్యోతిషశాస్త్రంలో సధ్య మరియు సిద్ధ యోగాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం సధ్య యోగంలో చేసిన ఏ పని అయిన అది ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుంది, విజయం వరిస్తుంది. సిద్ధ యోగాన్ని సర్వార్థ సిద్ధి యోగం అని కూడా అంటారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ యోగం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదను పెంచుతుంది. నాగ పంచమి రోజు మధ్యాహ్నం 01:46 వరకు సిద్ధయోగం ఉంటుంది. ఆ తర్వాత సధ్య యోగం ప్రారంభమవుతుంది.
పంచమి తిథి ఎప్పుడు
ఆగస్ట్ 09వ తేదీ అర్ధరాత్రి 12:36 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది.
నాగ పంచమి పూజ సమయం
నాగ పంచమి రోజున పూజకు అనుకూలమైన సమయం ఉదయం 05.46 నుండి 08.26 వరకు ఉంటుంది. పూజ వ్యవధి 02 గంటల 40 నిమిషాలు.
నాగదేవతను పూజించేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నాగ పంచమి రోజున నాగదేవతను ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నాగదేవత పూజలో పసుపును ప్రత్యేకంగా ఉపయోగించాలని నమ్ముతారు. ధూపం, దీపాలు, పూజా సామాగ్రి సమర్పించిన తర్వాత తీపి పదార్థాలు సమర్పించాలి.
నాగపంచమి ప్రాముఖ్యత
హిందూ మత విశ్వాసాల ప్రకారం నాగ దేవతారాధన పురాతన కాలం నుంచి ఉంది. ఇది ప్రకృతి ఆరాధన పండుగాగా కూడా భావిస్తారు. ఈరోజున నాగదేవతకు పాలతో అభిషేకం చేస్తారు. నాగ దేవతకు పాలు సమర్పించడం వల్ల అంతులేని సుఖాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజున్ ఇంటి ప్రవేశద్వారం వద్ద పాము విగ్రహాన్ని తయారు చేసి పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఇది పాము భయాలను తొలగిస్తుందని నమ్ముతారు.
నాగపంచమి రోజు సర్పదేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా పితృదోషం, కాలసర్ప దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అనంత్, వాసుకి, పద్మ, మహా పద్మ, తక్షక్, కులీర్, కర్కత్, శంఖ అనే ఎనిమిది సర్పాలను పూజిస్తారు. నాగదేవతను పూజించడం వల్ల భవిష్యత్ లో పాము కాటుకు గురి కాకుండా ఉంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీ సర్ప సూక్తం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
నాగ పంచమి పూజా మంత్రం
సర్వే నాగః ప్రీయంతాన్ మే యే కేచిత్ పృథ్వీథాలే
యే నదీషు మహానాగ యే సరస్వతీగమినః
యే చ వాపీతదగేషు తేజు సర్వేశు వై నమః
“ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల పాము కాటు భయం ఉండదు.