రేపే ఆషాడ అమావాస్య.. పూజా విధానం, పరిహారాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
ఈ సంవత్సరం ఆషాడ మాసం అమావాస్య ఆగస్ట్ 4న వస్తుంది. దీనిని హరియాళీ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు.
సనాతన ధర్మంలో ఆషాడ అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆగస్ట్ మాసంలో వచ్చే ఈ అమావాస్యను శ్రావణి, హరియాళీ అమావాస్య అని కూడా అంటారు.
ఉదయతిథి దృష్ట్యా ఈ ఏడాది ఆగస్ట్ 4న ఆషాడ అమావాస్య వస్తోంది. మరుసటి రోజు నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అమావాస్య రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆషాడ అమావాస్య శుభ సమయం, పూజా విధానం, పరిహారం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
అమావాస్య తిథి విశిష్టత
ఈ ఏడాది ఆషాడ అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా మారింది. ఆదివారం అమావాస్య రావడంతో పాటు ఈరోజు పుష్య నక్షత్రం ఉండటం వల్ల విశేషమైనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు చేసే దానం, పూజకు ఎన్నో వేల రెట్లు ఫలితం కలుగుతుందని వెల్లడించారు. ఈ అమావాస్య రోజు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఉదయం నుంచి శివయోగం ఏర్పడుతుంది.
ఉదయం 10.38 గంటలకు సిద్ధి యోగం ఉంటుంది. అలాగే ఉదయం 5.44 గంటల నుంచి మధ్యాహ్నం 1.26 వరకు రవి పుష్య యోగం ఉంది. దీనితో పాటు ఉదయం 5.44 గంటల నుంచి 1.26 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. పవిత్ర స్నానం ఆచరించేందుకు బ్రహ్మ ముహూర్తం మంచిది. అలాగే ఈరోజు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అభిజిత్ ముహూర్తంలో శివుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఆషాడ అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది?
అమావాస్య తిథి ప్రారంభం - ఆగస్టు 03, 2024 మధ్యాహ్నం 03:50 గంటలకు
అమావాస్య తిథి ముగుస్తుంది - ఆగస్టు 04, 2024 సాయంత్రం 04:42 గంటలకు
అమృత్ కాల్ - 06:39 AM నుండి 08:21 AM వరకు
అభిజిత్ ముహూర్తం- 12:00 PM నుండి 12:54 PM వరకు
సంధ్య ముహూర్తం- 07:10 PM నుండి 07:31 PM వరకు
స్నాన-దాన ముహూర్తం - 05.10 am - 7:30 am
పితృ దోష నివారణలు
ఆషాడ అమావాస్య ప్రత్యేక తేదీలో కొన్ని నివారణల సహాయంతో పితృ దోషం, కాల సర్ప దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. కావున ఈ రోజు శివుని నిండు భక్తితో పూజించండి. అదే సమయంలో పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున పితృ స్తోత్రం, పితృ కవచాన్ని ఖచ్చితంగా పఠించండి. ఆషాడ అమావాస్య నాడు బ్రాహ్మణులకు అన్నదానం, నైవేద్యాలు పెట్టడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కుటుంబ సభ్యులపై నిలిచి ఉంటాయి.
పూజా విధానం
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అనంతం పూజ గదిని శుభ్రం చేసుకుని మొదట వినాయకుడిని పూజించాలి. తర్వాత విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి పంచామృతం, గంగా జలంతో అభిషేకం చేయాలి. ఇప్పుడు పసుపు చందనం, పసుపు పుష్పాలను స్వామికి సమర్పించండి.
గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ విష్ణు చాలీసా పఠించండి. పూర్తి భక్తితో విష్ణువుకి హారతి చేయండి. తులసితో చేసిన నైవేద్యం సమర్పించాలి. చివరిలో క్షమాపణ కోసం ప్రార్థించండి.
ఆషాడ అమావాస్య విశిష్టత
ఆషాడ అమావాస్య రోజున దానం చేయడం, స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అమావాస్య రోజున దానం చేయడం ద్వారా పితృ దోషాలు తగ్గుతాయి. ఇది కాకుండా ఆషాడ అమావాస్య నాడు ఖచ్చితంగా పుణ్యనదులలో స్నానం చేయాలి. అదే సమయంలో ఈ రోజున ఆవులు, కాకులు, కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.