అపర ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణువు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి అవుతుంది.
వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి మే 23 మధ్యాహ్నం 1:12 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10:29 గంటలకు ముగిస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిధికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకని అపర ఏకాదశి ఉపవాసం మే 23న చేయాలి. అన్ని ఏకాదశులకు ఎంత విశిష్టత ఉందో అపర ఏకాదశికి కూడా అంత విశిష్టత వుంది.
అపర ఏకాదశి నాడు మొత్తం నాలుగు శుభ యోగాలు ఏర్పడతాయి. ఆ రోజున ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం, సర్వార్ధ సిద్ధియోగం అమృత సిద్ది యోగం ఏర్పడతాయి. దీంతో ఏకాదశి విశిష్టత ఇంకా పెరుగుతుంది.
అపర అంటే అపరిమితమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అపరిమితమైన సంపద లభిస్తుంది. అందుకని ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు. ఇంకో ఇంకో అర్థం ఏంటంటే, ఆరాధకుడికి ఇది అపరిమితమైన ప్రయోజనాలను అందిస్తుంది. అపర ఏకాదశి ప్రాముఖ్యత గురించి బ్రహ్మపురాణంలో కూడా చెప్పబడింది. ఈ ఏకాదశి నాడు దేశవ్యాప్తంగా ప్రజలు నియమాలతో విష్ణువుని పూజిస్తారు.
వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుతారు. పంజాబ్, జమ్ము కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుతారు. ఈరోజు భద్రకాళి దేవిని పూజించడం శుభప్రదం. ఒరిస్సాలో దీనిని జలక్రీడ ఏకాదశి అని అంటారు. జగన్నాధుని గౌరవార్థం దీనిని జరుపుకుంటారు.
అపర ఏకాదశి ఉపవాసం ఉంటే అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరణాంతరం స్వర్గాన్ని పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు జీవితంలో అపారమైన పురోగతిని పొందుతారు. మోక్షాన్ని కూడా పొందవచ్చు.
పంచాంగం ప్రకారం, మే 23న అపర ఏకాదశి వేళ 4 శుభ యాదృచ్ఛికాలు ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం మరియు అమృత సిద్ధి యోగం సాయంత్రం 04:02 నుండి మొదలవుతాయి.
మే 24 ఉదయం 05:26 వరకు ఉంటుంది. ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం 6:37 వరకు ప్రీతి యోగం ఏర్పడుతుంది. తర్వాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇదే కాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం నుంచి సాయంత్రం 4:02 వరకు ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.