రేపే అక్షయ తృతీయ.. స్వయంపాకంలో ఈ వస్తువులు పెట్టి దానం ఇస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం ఉంటుంది!-tomorrow is akshaya tritiya donate these things on this auspicious day for happiness and wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రేపే అక్షయ తృతీయ.. స్వయంపాకంలో ఈ వస్తువులు పెట్టి దానం ఇస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం ఉంటుంది!

రేపే అక్షయ తృతీయ.. స్వయంపాకంలో ఈ వస్తువులు పెట్టి దానం ఇస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం ఉంటుంది!

HT Telugu Desk HT Telugu

అక్షయం అంటే ఖర్చు కానిది. ఈ అక్షయ తృతీయ కర్ణుడి కథలోంచి వచ్చింది. ఏ జన్మలో అయినా పితృదేవతలకు ఆకలి లేకుండా మండేందుకు అక్షయ తృతీయ రోజున చేసే దానమే చాలా ముఖ్యం. స్వయంపాకంలో ఈ వస్తువులు పెట్టి దానం ఇస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం ఉంటుంది

అక్షయ తృతీయ దానం (pinterest)

అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో తెలీదు కానీ అది చాలా పెద్ద తపు. బంగారం అంటే కలి పురుషుడు. అంటే ఈ రోజు బంగారం కొనడం పాపాన్ని ఇంటికి తెచ్చుకోవడమే అని ప్రముఖ ఆధ్యాత్మికవెత పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అక్షయ తృతీయ జీవుడికి తృప్తి ఇస్తుంది. జీవులు బెంగ పెట్టుకోకుండా సర్వ కాలాలలోనూ ఉండేందుకు సంవత్సరానికి ఒకసారి మహా శివుడు కల్పించిన మహోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ అని చిలకమర్తి తెలిపారు.

అక్షయ తృతీయ దానం

అక్షయం అంటే ఖర్చు కానిది. ఈ అక్షయ తృతీయ కర్ణుడి కథలోంచి వచ్చింది. ఏ జన్మలో అయినా పితృదేవతలకు ఆకలి లేకుండా మండేందుకు అక్షయ తృతీయ రోజున చేసే దానమే చాలా ముఖ్యం. పితృదేవతలకు దారుణ శాపం దాహం. వారికి నీళ్ళు దొరకవు, అందుకే జీవి మరణానంతరం పదవ రోజున ధర్మోదకాల పేరుతో నీళ్ళు విడుస్తారు. ప్రేమ కలిగిన వారు, బంధువులు ఇలా ధర్మోదకాల ద్వారా వదిలిన నీళ్ళే పరలోక జజీవికి దాహార్తి తీరుస్తాయి.

బ్రాహ్మణుడికి స్వయంపాకం

అక్షయ తృతీయ రోజున ఓ బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం వలన పితృ దేవతలకు ఎంతో తృప్తి కలుగుతుంది. అంచు కలిగిన పంచె, వేసవి కావడంతో గొడుగు, చెప్పులు కూడా దానం చేయడం మంచిది. యజమాని ఒక్కరే ఇలా స్వయంపాకం ఇవ్వవచ్చు. అయితే భార్య కూడా జత ఉండి, పసుపు కుంకుమలు, చీర జాకెట్ ముక్కలు దానం చేస్తే, ఆమె జన్మజన్మలూ సువాసినిగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అని తెలిపారు.

అక్షయ తృతీయ స్వయం పాకంలో ఏ వస్తువులు ఇవ్వాలి?

స్వయంపాకం అంటే స్వీకరించిన వారు సంతృప్తి చెందాలి.

  1. బియ్యం (ఆ కుటుంబానికి సరిపడేవి)
  2. కందిపప్పు
  3. బెల్లం
  4. రాళ్ల ఉప్పు
  5. మిరపకాయలు
  6. ఆవాలు
  7. చింతపండు
  8. పెసరపప్పు
  9. ఐదు రకాల కూరగాయలు
  10. తోటకూర దానం అత్యంత పుణ్య ఫలితం
  11. అరటిపండ్లు
  12. దక్షిణ, తాంబూలం.

ముఖ్యంగా ఇవ్వాల్సిన మూడు వస్తువులు

1. కొబ్బరికాయ,

2. గుమ్మడికాయ,

3. తులసి దళం

పైన చెప్పినవి దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం అని చిలకమర్తి తెలిపారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం