Papamochini ekadashi: రేపే పాపమోచిని ఏకాదశి.. ఈ పనులు చేశారంటే ధన నష్టం జరుగుతుంది
Papamochini ekadashi: ఏప్రిల్ 5వ తేదీ పాపమోచిని ఏకాదశి వచ్చింది. ఆరోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. ఫలితంగా ధన నష్టం జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించారంటే మహా విష్ణువు అనుగ్రహం పొందుతారు.
Papamochini ekadashi: ఏప్రిల్ 5వ తేదీన వచ్చిన ఏకాదశిని పాపమోచిని ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఆచారాలతో పూజిస్తారు. శ్రీహరి అనుగ్రహం పొందడం కోసం కొన్ని పరిహారాలు తీసుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పాపమోచిని రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో పూజ చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. మోక్షం పొందుతారు.
పాపమోచిని ఏకాదశి పూజా విధానం
తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ గదిలో విష్ణు మూర్తి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసి పూజ చేసుకోవాలి. దీప, ధూప, నైవేద్యాలు, పండ్లు సమర్పించి పూజ చేయాలి. ఈరోజు మహావిష్ణువుకు తులసిని సమర్పించడం చాలా శ్రేయస్కరం. అయితే ఏకాదశి రోజు తులసి తెంపకూడదు. అందువల్ల ఏకాదశి ముందు రోజే తులసి ఆకులు భద్రపరుచుకోవాలి. పూజ చేసిన తర్వాత పాపమోచిని వ్రత కథను చదువుకోవడం మంచిది. మీ రాశి ప్రకారం ఇలా విష్ణువును పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారు.
మేష రాశి
మేష రాశి వాళ్ళు విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకం చేసి పసుపు చందనం రాయాలి. అలాగే స్వచ్ఛమైన నెయ్యిలో కుంకుమపువ్వు కలిపి సమర్పించండి. ఈ పరిహారం పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పితృ దోషం తొలగిపోతుంది.
వృషభ రాశి
విష్ణు అనుగ్రహం పొందడం కోసం వృషభ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే కృష్ణుడికి పంచదార మిఠాయితో కూడిన వెన్న సమర్పించాలి. ఇలా చేస్తే జాతకంలో చంద్రుడు బలపడతాడు. దోషాలు తొలగిపోతాయి.
మిథున రాశి
పాపమోచిని ఏకాదశి నాడు కృష్ణుడికి శనగపిండి లడ్డూలు సమర్పించాలి.
కర్కాటక రాశి
విష్ణు అనుగ్రహం పొందేందుకు ఈరోజు పూజలో పసుపు రంగు పువ్వులు సమర్పించండి.
సింహ రాశి
పాపమోచిని ఏకాదశి రోజు సింహ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లం సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయాలి.
కన్యా రాశి
పసుపు చందనాన్ని స్వామికి రాయడం వల్ల విష్ణు అనుగ్రహం పొందుతారు.
తులా రాశి
తులా రాశి వాళ్ళు విష్ణువుకు పచ్చిపాలు, గంగాజలంతో అభిషేకం చేసి పూజించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి విష్ణుమూర్తికి పెరుగు, తేనెతో అభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి.
ధనుస్సు రాశి
విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు, బట్టలు సమర్పించాలి.
మకర రాశి
పాపమోచిని ఏకాదశి రోజు మకర రాశి వారు విష్ణు చాలీసా పఠిస్తే మంచిది.
కుంభ రాశి
బెల్లం శనగపప్పు సమర్పించి పూజ చేయాలి.
మీన రాశి
పాపమోచిని ఏకాదశి నాడు మీన రాశి వారు ఓం విష్ణు నమః మంత్రాన్ని పఠించాలి.
పూజ చేసిన తర్వాత శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం మంచిది. అలాగే ఏకాదశి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇవి చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందలేరు.
ఏకాదశి నాడు అన్నం తినకూడదు. ఈరోజు అన్నం తింటే అపరాధం చేసినట్టు అవుతుందని నమ్ముతారు. తులసి ఆకులు లేకుండా విష్ణుమూర్తికి భోగం సమర్పించకూడదు. అలాగే ఏకాదశి రోజు తులసి ఆకులు తెంపకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తారు.
పూజ చేసే సమయంలో నల్లని దుస్తులు ధరించకూడదు. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభదాయకం. మద్యపానం, ధూమపానం, తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఎవరిని నొప్పించ కూడదు. ఎగతాళి చేయడం, గొడవపడటం వంటివి చేయకండి. ఏకాదశి నాడు ఏ పనులు చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది.