చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు. ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలను పాటించడానికి జూలై 1 చాలా మంచి రోజు.
జూలై 1న మంగళవారం, పైగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి వచ్చింది. ఈరోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు, సంతోషంగా జీవించొచ్చు.
మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి రావడం చాలా మంచిది. దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సంతానం లేని వారు, సంతానం అభివృద్ధి లేని వారు ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.
ఈ మంత్రాన్ని జపించండి: “ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్.”
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి వీలైనంత సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం కనబడుతుంది. సమస్యలన్నీ తగ్గిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు.
సుబ్రహ్మణ్య స్వామికి మహా ప్రీతికరమైన రోజు కావడంతో, ఈ రోజున కుజ దోషం ఉన్నవారు, కాల సర్ప దోషం, పితృ శాపం, వివాహం కానివారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు, సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు వంటివి తొలగిపోవాలన్నా ఈ షష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది.
ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం జరిపితే కూడా మంచి జరుగుతుంది, సమస్యలు గట్టిక్కుతాయి. అలాగే ఈ సమస్యలన్నీ తీరాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.