సెప్టెంబర్ 20, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి అంచనాలను మించి ఆదాయం లభిస్తుంది-today september 20th rasi phalalu check mesham to meenam daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 20, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి అంచనాలను మించి ఆదాయం లభిస్తుంది

సెప్టెంబర్ 20, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి అంచనాలను మించి ఆదాయం లభిస్తుంది

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.09.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 20, నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 20, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.09.2024

వారం: శుక్ర‌వారం, తిథి: త‌దియ‌,

నక్షత్రం: అశ్విని, మాసం: భాద్ర‌ప‌ద‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించినమేర లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వీరి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం ఉంది. అనారోగ్య సమ‌స్య‌లు ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిడులు ఉన్నాయి. తెలుపు, ఎరుపు రంగులు మంచివి. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం

శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. భూసంబంధిత వివాదాల పరిష్కారం అవుతాయి. విద్యార్థుల తెలివితేటలు అవకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణం య‌త్నిస్తారు. కొనుగోలు ప్రయత్నాలు వేగ వంతంగా చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి నుంచి పిలుపు రావచ్చు. పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం ఉంది. మానసిక సంఘర్షణ ఉంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. విష్ణుధ్యానం చేయండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఆర్థిక విషయాలు గందర గోళంగా ఉండి అప్పులు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొన్ని అవాంతరాలు రావచ్చు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. లాభాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. కళారంగం వారికి చికాకులు పెరుగుతాయి. శుభవార్తాలు వింటారు. వాహనయోగం ఉంది. నేరేడు, లేత ఎరుపు రంగులు మంచి ఫ‌లితాలు అందిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

క‌ర్కాట‌కం

ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్థలాలు, వాహనాలు కొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలించే సమయం వ‌చ్చింది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. వ్యాపారాలలో ముందడుగు వాతావ‌ర‌ణం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యయప్రయాసలు ఉండొచ్చు. నీలం, నేరేడు రంగులు క‌లిసి వ‌స్తాయి. అంగారక స్తోత్రం పఠించండి.

సింహం

కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం మీ అంచనాల మేరకు లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వస్తు లాభాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాలకు ఉన్నత పదవులు ద‌క్క‌వ‌చ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యం సహకరించదు. లేత ఆకుపచ్చ. గులాబీ రంగులు క‌లిసి వ‌స్తాయి. గణేశాష్టకం పఠించండి.

కన్య

కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకోని అవకాశాలు ద‌క్కుతాయి. వృథా ఖర్చులు ఉన్నాయి జాగ్ర‌త్త‌. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. చాక్లెట్, ఎరుపు రంగులు మంచి ఫ‌లితాలు అందిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి.

తుల

అతి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఖర్చులకు సరిపడా లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు ప్రస్తుతం వాయిదా వేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పోస్టులు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వేత్తలు శక్తియుక్తులతో సంస్థలను నడిపిస్తారు. వ్యయ ప్రయాసలు ఉండొచ్చు. ఆకుపచ్చ, తెలుపు రంగులు ధ‌రించండి. శివాష్టకం పఠించండి.

వృశ్చికం

అద‌న‌పు రాబడితో హుషారుగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జ‌రుగుతాయి. అందరూ ఆశ్చర్యపడేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని విశేష గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సందేశం ఊరటనిస్తుంది. రాజకీయ వర్గాలకు విదేశీయానం అవ‌కాశాలు ఉన్నాయి. ఆస్తుల వివాదాలు ఉన్నాయి. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు క‌లిసి వ‌స్తాయి. విష్ణుధ్యానం చేయండి.

ధ‌న‌స్సు

విద్యార్థులయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు రాదు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం ఉంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు సన్మానయోగం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావ‌చ్చు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు మంచి ఫ‌లితాలు ఇస్తాయి. దుర్గా స్తోత్రాలు పఠించండి.

మకరం

అనుకున్న స‌మ‌యానికి ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాల పరిష్కారమై ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు, విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో సఫలం చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలపై పట్టు లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధననష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంది. కుటుంబంలో సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, గులాబీ రంగులు ధ‌రించండి. వినాయకుని పూజించండి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారి ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడి కొంత నిల్వ చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం క్రమేపీ మెరుగవుతుంది. వ్యాపారాలలో రెండడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుంచి విముక్తి, రాజకీయవర్గాలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు ప‌ఠించండి. నవ గ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. నిరుద్యోగులు మరింత సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రీతిలో నిర్ణయాలు ఉంటాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేయ‌వ‌చ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు క‌లిసి వ‌స్తాయి. కనకధారా స్తోత్రం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ