Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి సంతోషంగా ఉండడమే కాకుండా విలువైన బహుమానాలు, ఆదాయం పెరుగుదల ఇలా ఎన్నో-today rasi phalalu this zodiac sign will get many benefits including wealth and happiness check yours also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి సంతోషంగా ఉండడమే కాకుండా విలువైన బహుమానాలు, ఆదాయం పెరుగుదల ఇలా ఎన్నో

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి సంతోషంగా ఉండడమే కాకుండా విలువైన బహుమానాలు, ఆదాయం పెరుగుదల ఇలా ఎన్నో

HT Telugu Desk HT Telugu
Jan 08, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.01.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి సంతోషంగా ఉండడమే కాకుండా
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి సంతోషంగా ఉండడమే కాకుండా

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.01.2025

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : బుధవారం, తిథి : శు. నవమి, నక్షత్రం : అశ్విని

మేష రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. ముఖ్య |మైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచ యాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మ బలముతో వాటిని జయిస్తారు. తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుం డా వీలైనంతవరకూ మౌనం పాటించటమేలు, ఆకస్మిక ఖర్చు లు అధికంగా ఉంటాయి. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. గురువులని పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి. కళా రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు కుటుంబ వార్తలను అహ్లాదకరంగా ఉ ంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవు తాయి. పనులలో అలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తి | గత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు చికాకులు కలిగిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పైన ఆసక్తి ఉండదు. మాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పసులు వాయిదా పడతాయి.

మిధున రాశి

ఈ రాశి వారికి ఈ రోజు సంతానముతో, ఆత్మీయ వ్యక్తుల తో అహ్లాదకరంగా గడుపుతాడు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి ఆశీస్సులు తీసు కుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి సృజనాత్మకత వాగుంటుంది. అనుకున్న విషయాలు సత్ఫలితాలు నిస్తాయి. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనల అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు విందు వినోదాలతో, ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభమవు తుంది. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరో గ్యం బాగుంటుంది. సంతాన విద్య అభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వోగ పూరితంగా ఉ న్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు. భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబములోని పెద్దలు తీర్థయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు తల్లి ఆరోగ్య ఆదాయం అభివృద్ధి కరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్దను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తో బుట్టువులకు నూతన అవకాశములు. ఎంతోకాలం ఎదురు చూస్తున్న దూర ప్రదేశంలో నుంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్నిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి.

కన్యా రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహకారం ఆశించిన విధము గా అనుకూలంగా ఉంటుంది ధైర్యము, పరాక్రమం పెరుగు తుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్న పాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పనిచేసే ఉన్నత అధికారుల ప్రశంసలను పొందుతారు. దానివలన వృత్తిపరమైన అలసట, అనారోగ్య భావనలు సమయానికి విశ్రాంతి ఆహార స్వీకరణ మేలు.

తులారాశి

ఈ రాశి వారికి ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉం. టుంది. చాలాకాలంగా చూస్తున్న రావలసిన ఆదాయమును అందుకుంటారు. యదార్థవాది బంధు విరోధి అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చిగా ఉండటం వల్ల కొందరు ఇబ్బంది. పడే అవకాశం ఉంది. కొన్ని పనులలో ఆటంకాలు ఆల స్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు. మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. వాటిని అమలు చేయడములో చేసే ప్రయత్నాలు ఆనుకూలంగా ఉంటాయి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రద్ధ. అలంకరణమీద ఆసక్తి పెరుగుతాయి. భాగస్వామితో కలిపి నూతన నిర్ణ యాలు తీసుకుంటారు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తా రు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. వ్యక్తిగత సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. ఇతరులకు రుణములు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన రేకెత్తి స్థాయి. గృహ ఆదాయం బాగుంటుంది. తల్లితర బంధువుల నుంచి రాకపోకలుంటాయి. బహుమానములు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువులతో సంప్రదిస్తారు.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉ పయోగకరంగా ఉంటాయి. ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అభి వృద్ధిని కలిగిస్తాయి, ఆధ్యాత్మిక ఆలోచనలతో సంవత్సరాన్ని స్వాగతం పలుకుతారు. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్నతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా. వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు, లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూ లం గా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. సంతానము అభివృద్ధి కొరకు ఆలోచి స్తారు. వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి

మకర రాశి

రాశి వారికి ఈ రోజు సంతోషంగా శుభవార్తలతో వృత్తిపర మైన అభివృద్ధితో, మొదలవుతుంది. కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్ని స్థాయి.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరి స్తారు. వృత్తిపరంగా ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయ మునకు తగిన ఆహార స్వీకరణ అవసరము. భూమికి సంబం దించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. తోబుట్టువులతో నిధానమవసరం. నూతన బాధ్యతలు అధిక ముగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది వడ తారు. ఆత్మీయుల సహకారంతో కోరుకున్న విషయంలో పనులు ముందుకు సాగుతాయి. భాగస్వామి సంబంధ అంశాలు ఒక్కలికి వస్తాయి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

మీనరాశి

రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, అవి సంతో షాన్ని ఉపయోగపడ్డాన్ని సూచిస్తున్నాయి. విద్యా పరంగా అభివృద్ధి వరంగా ఉంటుంది. పెద్దలు గురువులు ఆశీస్సు లతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయత్నం చేయువా రికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అభివృద్ది కరంగా, విదేశీ పరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరముగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner