Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.. ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 09.01.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.01.2025
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : గురువారం, తిథి : శు. దశమి, నక్షత్రం : భరణి
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్ధిక స్థితి అనుకూలిస్తుంది. పట్టుదలతో పని చేస్తారు. ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం. అపార్థాలకు తావివ్వకండి. కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో సమర్థంగా స్పందించండి. కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి. సమయానికి పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కొత్త ప్రయత్నాలు వద్దు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు మనోబలం పెంచుకోండి. అంతరాత్మ ప్రబోధంతో ముందుకెళ్లండి. అన్ని ఫలితాలూ మిశ్రమంగా ఉంటాయి. మరింత జాగ్రత్తగా అడుగేయండి. మదిలో చెడు ఆలోచనలు రానివ్వకండి. మొహమాటం వద్దు. మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో సవాళ్లు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు బుద్ధిబలం అవసరం. పరిస్థితులకు తగినట్టు స్పందించాలి. ఏకాగ్రత పెంచుకోండి. శక్తికి మించిన భారం భుజాన వేసుకోవద్దు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వ్యాపార విజయాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. ఉద్యోగులు పనిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. ఒత్తిడిని జయించాలి. మాటపట్టింపులు కీడు చేస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం పఠించండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలతో నలుగురి మెప్పూ పొందుతారు. ఏకాదశ బృహస్పతి యోగం మీ ఎదుగుదలకు సహకరిస్తుంది. ఆర్ధిక విజయాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు సరైన సమయం. కాకపోతే, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఓర్పూ నేర్పూ అవసరం. మీవల్ల కొందరికి కలిసొస్తుంది. కుజగ్రహ స్తోత్రం చదువుకోండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం లాభదాయకం, దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. సమస్యల్ని బుద్ధిబలంతో అధిగమించాలి. గ్రహ దోషం అధికంగా ఉంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదనలు వద్దు. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ స్తోత్రాలను పఠించండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఆశయాలు నెరవేరతాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి. అదృష్టయోగం కొనసాగుతోంది. ఆత్మసమీక్ష అవసరం. ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మరింత నైపుణ్యం అవసరం. విష్ణుమూర్తిని ధ్యానించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో కీలక మలుపులు ఉంటాయి. సృజనాత్మకతను పెంచుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గృహ, వాహనాది యోగాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోండి. లక్ష్యసాధనకు మరింత కృషి అవసరం. గురుగ్రహ స్తోత్రం పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్మీకటాక్షం ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆపదల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అలసత్వం మంచిది కాదు. ప్రతిసారీ చెడును ఊహించుకోవద్దు. ఆరంభశూరత్వం పనికిరాదు. మొదలు పెట్టిన పనుల్ని మధ్యలోనే ఆపేయకండి. ఒత్తిడికి గురికావద్దు. తాత్కాలిక లాభాలకు దూరంగా ఉండండి. సూర్యభగవానుడిని ఉపాసించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ధనయోగం ఉంది. సమయానికి డబ్బు అందుతుంది. శ్రమకు తగిన పలితం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. దుర్జన సాంగత్యం నష్టం కలిగిస్తుంది. వ్యాపారంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అనవసర ప్రయాణాలు వద్దు. నవగ్రహ స్తోత్రాలను పఠించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టయోగం ఉంది. దైవానుగ్రహం తోడవుతుంది. అందివచ్చిన అవకాశాల్ని జారవిడుచుకోకండి. ఉద్యోగులు ప్రశాంతంగా వ్యవహరించాల్సిన సమయం. ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. కుటుంబ జీవితం ఆనందకరం. వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు అభీష్టసిద్ధి కలుగుతుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్ధిక స్థితి మెరుగు పడుతుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. మీ నిర్ణయాలపైనే లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించండి. ఓ ఆపద నుంచి సురక్షితంగా బయటపడతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. పదవీ యోగం ఉంది. ఆర్ధిక స్థితి ఇంకొంత మెరుగుపడుతుంది. గ్రహబలం తక్కువ. కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. మనోబలంతో వాటిని అధిగమించాలి. నమ్మకద్రోహానికి ఆస్కారం ఉంది. తెలివిగా వ్యవహరించండి. నవగ్రహ స్తోత్రాలను పఠించండి.
టాపిక్