Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదృష్టంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు.. మీ రాశి ఎలా వుంది? ఏ రాశి వారు ఏం చేయాలంటే?
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.01.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 30.01.2025
సంబంధిత ఫోటోలు
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : గురువారం, తిథి : శు. పాడ్యమి, నక్షత్రం : శ్రావణ
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు శుభయోగాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. చక్కని ప్రణాళికతో మరిన్ని విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. గురుబలం అనుకూలంగా ఉంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది. వ్యాపారం లాభదాయకం. అదే సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం, లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమకాలం నడుస్తోంది. పొరపాట్లకు ఆస్కారం ఉంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఆర్ధిక నియంత్రణ అవసరం. పనుల వాయిదా వద్దు. పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహాల్ని ద్యానించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు అవసరాలకు డబ్బు అందుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదే సమయంలో పొదుపు-మదుపు గురించీ ఆలోచించాలి. చెడును ఊహించుకోవద్దు. మిత్రుల సలహాలు తీసుకోండి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మీ సహనాన్ని పరీక్షించేవారితో జాగ్రత్త. ఆత్మీయు ఆస్కారం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకోండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం లాభదాయకం. మీదైన రంగంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ప్రగతికి సహకరించే నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అయాచిత లాభాలు ఆశించవద్దు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మీదేవిని పూజించండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. మీదైన రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ కారణంగా నలుగురికీ మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం లాభాలను అందిస్తుంది. ఒంటరి పోరాటం వద్దు. స్నేహితుల సాయం తీసుకోండి. ఊహించని వ్యయాలు ఉంటాయి. ఆర్ధిక ప్రణాళిక అవసరం. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు మనోబలంతో పనులు ప్రారంభించండి. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత సాధిస్తారు. బుద్ధిబలం పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఆపదలు తొలగిపోతాయి. శ్రమ అధికమైనా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం అవసరం. ఆచితూచి మాట్లాడండి. శివాలయాన్ని సందర్శించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు సత్వర నిర్ణయాలతో ఆర్థికంగా లాభపడతారు. మిశ్రమకాలం నడుస్తోంది. జాగ్రత్తగా అడుగేయాలి. చిన్నపాటి సమస్యలున్నా. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించండి. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. కోపతాపాలకు తావివ్వకండి. చిరునవ్వుతో సంభాషించండి. వ్యాపారం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహాల్ని పూజించండి..
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు అన్నివిధాలుగా మేలు జరుగుతుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార యోగం సూచితం. గ్రహాల అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల సలహాలూ, మిత్రుల సూచనలూ మేలు చేస్తాయి. దీర్ఘకాలిక స్వప్నం సాకారం అవుతుంది. శ్రీవేంకటేశ్వరుడిని ధ్యానించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ప్రయత్నాలు సఫలం అవుతాయి. కృషిని బట్టి విజయాలు ఉంటాయి. సామరస్య ధోరణి అవసరం. మనోబలంతో ఒత్తిడిని జయించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కొద్దికాలం పాటు మౌనమే ఉత్తమం. దనయోగం ఉంది. వ్యాపార వ్యవహారాల్లో సకాలంలో స్పందించాలి. అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టదైవాన్ని ఉపాసించండి..
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకం. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ, బాధ్యతల్ని సమర్థంగా పూర్తి చేస్తారు. ఒత్తిడికి గురికావద్దు. పొరపాట్లకు ఆస్కారం ఉంది. చక్కని ప్రణాళికతో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. విష్ణుమూర్తిని ధ్యానించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో కలిసొస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఏకాగ్రత పెంచుకోండి. బుద్ధి చతురతతో విస్నూలను అధిగమిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త, ఇష్టదైవాన్ని స్మరించుకోండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తగా స్పందించండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. మితభాషణం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.