Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధన లాభం, కొత్త వస్తువులు.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 03.02.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 03.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : సోమవారం, తిథి : శు. పంచమి, నక్షత్రం : రేవతి
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందు తారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. రామాలయాన్ని సందర్శించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. తల పెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సిద్ధి ఉంది. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత నెలకొం టుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల లబ్ది పొందుతారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. గురు గ్రహ ప్రభావంతో అన్ని పనుల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన మేలుచేస్తుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు కార్య నిర్వహణపై శ్రద్ధ చూపడం అవసరం. వాహనాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కాలభైరవ ఆరాధన శుభప్రదం.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమ యానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యా ర్థులు రాణిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సూర్యారాధన మేలుచేస్తుంది.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కుదురుగా ఉంటారు. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. పదో న్నతి అవకాశం ఉంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుం టారు. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. సకా లంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఓరిమి వహించడం అవసరం. శివ ధ్యానం మేలుచేస్తుంది.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరు తాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలం. అయితే ఖర్చులు పెరగవచ్చు. విద్యా ర్థులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగుల పని భారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో, తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. విందులు, వినో దాలకు హాజరవుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు ఫలి స్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త పాటించండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరుగుతుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.