Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు ఆర్థిక లాభాలు, ప్రయాణాలతో ఎంతో సంతోషం
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.02.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : శుక్రవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : పుబ్బ
మేష రాశి
ప్రారంభంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా కంటికి సంబంధిం చిన విషయాలలో జాగ్రత్తలు అవసరము. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకుంటారు వారి ఆశీస్సులు తీసుకుంటారు ట్రస్టులు మొదలైన వాటికి విరాళాలు ఇస్తారు.
వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఆలోచనలు మొదలైన వాటి వల్ల శ్రమ, సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కొంత అనారోగ్య భావనలు. వ్యక్తిగత ఆలోచనలు బాగుంటాయి శారీరక శ్రద్ధ పెరుగుతుంది నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభ రాశి
కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లాభాలు, ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది. మీ సేవలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ వచ్చిన లాభాలను సద్వినియోపరుచుకునే విషయంలో కూడా అనాసక్తి వైరాగ్య భావనలు.
వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబపరమైన ముఖ్య కార్యక్రమాలు, దైవ సందర్శన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్రలేమి ఆహార లోపం చికాకును కలిగిస్తాయి. ఇప్పటిదాకా మందకొడికే సాగిన ఆర్ధిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది
మిధున రాశి
వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఖర్చులు శక్తికి మించి ఉండడం వల్ల చికాకులు పెరుగుతాయి. రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి కృషి పెరుగుతుంది. మీ తెలివి తేటలతో వాటిని అధిగమించగలుగుతారు.
అనవసర వ్యక్తు ల జోక్యం వల్ల వృత్తిలో చికాకులు అధికం. చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం చేస్తారు. అలాంటి ఆలోచనలు నియంత్రించుకుంటూ యోగా మెడిటేషన్ మొదలైనవి. చేయడం మంచిది. విద్యార్థులు విద్యకి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటక రాశి
ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సామాజిక సేవ చేస్తారు. తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం ఆవటం లేదని ఒక రకమైన అసంతృప్తి ఉన్నప్పటికీ మీ పుణ్యు బలముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు.
తండ్రి పెద్దలు గురువుల ఆశీస్సుల లభ్యమవుతాయి. జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. రుణములు చెల్లించుటకు మీరు. చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
సింహ రాశి
రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకో వాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. ప్రయా ణాల విషయం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువులని అజాగ్రత్తగా వదిలేయకూడదు.
ప్రయాణాలలో నూతన వ్యక్తులని నమ్ముతూ ముందుకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి యొక్క బంధువులు మీ ఇంటికి రాక, చేసే కార్యక్రమాల్లో ఆసంతృప్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఆటంకాలు, దూర ప్రయాణాలు, విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయాలు, విదేశీ విద్యకై ఆలోచనలు, ఆకస్మిక ధన రాబడి, భాగస్వామ్యం వ్యవహారాల్లో నూతన ఆలోచనలు,
కన్యా రాశి
దూర ప్రయాణాలకు అవకాశం. జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక్తుల దీవె నలు అందుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విషయంలో | శ్రద్ధతో నిర్ణయాలు, భాగస్వామ్య విషయాల్లో ఆశ్రద్ధ ఉండడం వల్ల అపార్ధాలకు అవకాశం ఉంది.
సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బం దులు ఎదుర్కొంటారు. సంతానముతో కలిసి వారి అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు చేస్తారు. ఉపాసన విషయం లో ఆటంకాలు, కుటుంబంలోని ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి. కమ్యూనికేషన్ బాగుంటుంది.
తులారాశి
ఆరోగ్యరీత్యా తగిన జాగర్తలు అవసరం. కోపం నియంత్రించుకోవాలి. సామజిక సేవ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, పుణ్యనదీ స్నానములు, మీ సంబంధ న్యాయ విషయములకై మంతనములు, ఖర్చులు నియాండ్రించుకోవాలి. అప్పులు చేసితీర్చే ప్రయత్నాలు. శత్రువులు ఇబ్బంది చికాకులు, రోగనిరోధక శక్తి పెంపోం దించుకోవాలి.
ఋణముల విషయం లో ఆప్రమత్తం అనవ సరస్నేహలకై వృథా ఖర్చులు, అలవాట్లు వలన ఇబ్బందులు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్ధిక సహకారము. కుటుంబములో కొంత ఆహ్లాద వాతావం-ణము. విద్యార్థులు శ్రమ ఆధికము. తల్లి తండ్రుల సలహా తోడ్పా టు. ఆహారము కొత్త ప్రదేశాల్లో తీసుకునేటపుడు జాగర్త.
వృశ్చిక రాశి
విద్యార్థులకు విద్యా సంబంధ అంశాల్లో రాత నైపుణ్యాలు తగిన విధంగా ఆసక్తి పెంచుకోవాలి. ఉప సనాబలం పైన శ్రద్ధ తీసుకుంటూ నైరశ్యాన్ని దూరం చేసు కుని ముందుకు సాగాలి, ఆలోచనలో ఆలస్యాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన శ్రేయోభిలాషుల యొక్క సలహా సహకారంతో సమస్యల అధికమిస్తారు. డివియేషన్సు స్నేహ సంబంధాలు వల్ల విద్యా సంబంధ ఇబ్బంది అధికంగా ఉంటాయి.
మానసిక ఒత్తిడి సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ యోగ మెడిటేషన్ మొదలైంది చేయడం వల్ల మంచిది. గవర్నమెంట్ నుంచి రావలసిన ధనాన్ని ఆకస్మికంగా అందు కుంటారు. కుటుంబంలో వ్యక్తులకి వృత్తి కొరకు అవకాశా లు బభిస్తాయి. మిత్రులతో కలిసి ప్రయా ణాలు, సరదా ప్రదేశాలకు వెళ్లడానికి అవకాశాలు. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి విద్యాపరమైన నూతన విషయాలు తెలుసు కుంటారు తల్లి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు శ్రీహయగ్రీవాయనమః మంత్రాన్ని పట్టించడం చాలా మంచిది.
గృహవాతావరణం, ముఖ్యంగా గృహంలో చిన్న పాటి రిపేర్లు వాహనానికి సంబంధించిన అంశాలు కొంత చికాకులు కలిగిస్తుంది. అయినప్పటికీ వాటిని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళతారు. నూతన సృజనాత్మకమైన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కొత్త విషయాలు వింటారు.
మకర రాశి
ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండడం. మధ్యవర్తిత్వాలు అగ్రిమెంట్లు పనికిరాదు. వ్యక్తుల సహకారం తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బందులు అధికంగా ఉంటాయి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు కోల్పోయే రీత్యా మీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి.
ఆత్మీయ వ్యక్తుల సహకారంతో చెప్పవలసిన మాటలను చక్కగా చెబుతూ ఫలితాలు సాధించాలి. గృహ వాతావరణం వాహనాన్ని సంబంధించిన విషయాలు, సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణ విషయంలో ఆగిన పనులు కొంత చర్చకు రావడం జరుగుతుంది.
కుంభ రాశి
ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. రావలసినదని రావడంలో కొంత ఆలస్యాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇచ్చిన మాట నిలబెటు కోవడం కొంత కష్టంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం కొంత విసుగును కలిగిస్తుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో అవలీలగా ముందుకు వెళతారు, ఆగుతూ వస్తున్న పసులు ముందుకు పెడతాయి.
సంకల్ప బలం పెరుగుతుంది కమ్యూనికేషన్ బాగుంటుంది వ్యక్తులు సహకరిస్తారు మిత్రులతో కలిసి చర్చలు చేసి నూతన ఆలోచనలకు శ్రీకారం మడతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల కొరకు ఖర్చులు అధికం చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులతో చర్చలు చేసి స్థిర ఆస్తుల కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం.
మీన రాశి
మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వల్ల అందరికీ దూరంగా ఉంటారు. అయినప్పటికీ అవన్నీ మీ మనోబలంతో జయించే ప్రయత్నాలు చేయాలి. ప్రవచనాలు మొదలైన వాటి మీద ఆసక్తి అధికంగా ఉ ంటుంది ఆధ్యాత్మిక ధోరణి, నైరాస్యమైన ఆలోచనలు, మీ మీద మీకు శ్రద్ధ తక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్మించాలని కోరిక బలంగా ఉంటుంది. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న ఎదురుచూస్తున్నదనాన్ని కొంతైనా అందుకుంటారు. విద్యాపరమైన వస్తువులు కొనుగోలు కొరకు ఖర్చుల అధికంగా ఉంటాయి.
టాపిక్