Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. రావలసిన ధనం అందుతుంది.. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో పాటు ఎన్నో-today rasi phalalu these zodiac signs will get many including money trips happiness and many more see your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. రావలసిన ధనం అందుతుంది.. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో పాటు ఎన్నో

Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. రావలసిన ధనం అందుతుంది.. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Published Feb 13, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 13.02.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : గురువారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : మఖ

మేషం

ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగు తాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో తరుచూ సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలివారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి.

వృషభం

పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు అందుకుంటారు. పనులు పురమాయించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితులను సంప్రదిస్తారు. ప్రముఖుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి.

మిధునం

శుభసమయం సమీపిస్తోంది. దైర్యంగా ముందుకు సాగండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. యత్నాలకు అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. దనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది.

కర్కాటకం

కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పరి స్థితులు నిదానంగా చక్కబడతాయి. సన్ని హితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. దైర్యంగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బెట్టింగ్ల జోలికి పోవద్దు.

సింహం

ఓర్పుతో యత్నాలు సాగిం చండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. కలుపుగోలుతనంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

కన్య

ఆర్థికలావాదేవీల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనాలోచితంగా వ్యవహరిస్తే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పణ్యకార్యంలో పాల్గొంటారు..

తుల

మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవు తారు. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సోదరులతో చర్చలు జరుపుతారు.

వృశ్చికం

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. బంధుమిత్రుల రాక పోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు

వ్యవహారానుకూలత ఉంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ముఖ్యులతో చర్చలు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి.

మకరం

వ్యవహారానుకూలత, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం అందుతుంది, అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు, పెద్దమొత్తం ధన సహాయం తగదు. అర్దాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనవర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యానికి హాజరవుతారు.

కుంభం

ప్రతికూలతలు అధికం. సంప్రదింపులతో తీరిక ఉండదు. లావావీదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఆవేశాలకు లోనుకా వద్దు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగి స్తాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టం మ్మీద ధనం అందుతుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రయాణం తలపెడతారు.

మీనం

ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యవ హారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశ మనం కలిగిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner