Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కొత్త వాహనం, ఆకస్మిక ధన లాభంతో పాటు ఎన్నో.. మీ రాశిఫలాలు చెక్ చేసుకున్నారా?
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.02.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : బుధవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : భరణి
మేషం
ఈ రోజు మానసికంగా శారీరకంగా మీరు పడుతున్న వేదన ఎవరికీ కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మి కటాక్షం ఏర్పడుతుంది. కుటుంబ పరమైన బరువు బాధ్యతలు పంచుకోవడానికి కొంతమంది ముందుకు రావడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. నూతన పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉంటాయి. ఎంతో కష్టపడి విద్యాభ్యాసాని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గౌరవప్రదమైన సత్కారాలు సన్మానాలు ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తిపరమైన బరువు బాధ్యత మరింత పెరుగుతాయి, సర్వ రక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన ముడి పడుతుంది. కార్యక్రమాల గురించి మాటలు జరుగుతాయి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు అయిన వాళ్ళు ఏర్పడినటువంటి తగాదాలు పరిష్కరించుకోవడానికి శుభకార్యాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడతాయి చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం పనికిరాదు. ప్రతిరోజు దేవి దేవతలకు ప్రథము తాంబూలాన్ని సమర్పించండి. రాజకీయాల్లో ఉన్న వారితో పరిచయం పెంచుకుంటారు.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. భూ సంబంధమైన క్రయవిక్రయాలలో మంచి లాభాలను అందుకో గలుగుతారు. సుమంగళి పసుపు తో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కొన్ని ఆసత్య ప్రచారాలు విమర్శలను ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలసి వస్తాయి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు విరమించుకుంటారు. ఆర్థిక స్థోమత అందుకు సహకరించక ఇక్కడే చదువుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో గురువులతో సఖ్యత కలిగి ఉంటారు. బంధువులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి అర్చన జరిపించండి, కొత్త కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇంపోర్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారస్తులకి చిక్కులు ఎదురవుతాయి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఫార్మా కంపెనీలో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. నిద్ర భంగం వాటిల్లుతుంది. జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయాలు మీకు ఏమాత్రం నచ్చవు ఎంతో ఓర్పుతో సహించి మంచి సలహాలు సూచనలు మీరు ఇచ్చినప్పటికీ వారు అవి తిరస్కరించటం వల్ల కొత్త సమస్యలు ఏర్పడతాయి. అష్టమూలికా తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. నూతన ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగే స్థాయికి మీరు చేరడం మీ మానసిక ధైర్యానికి కారణమవుతుంది.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు కొంతకాలంగా మదన పడుతున్న సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటకు రాగలుగుతారు. దూరప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తాత్కాలికంగా వాయిదా వెసుకుంటే అన్ని విధాలా మంచిది. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. తాతల ఆస్తి పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీకు కూడా కొంత భాగం రాగలిగితే మీరు ఉన్న పరిస్థితికి అండగా నిలుస్తుందని భావిస్తారు. దీనికి సంబంధించి దాయాదులు తో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు ప్రభుత్వపరమైన లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తాయి.. పెండింగ్లో ఉన్న బిల్లు గురించి మంచి శుభవార్త వింటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన ముడి బడతాయి. మీ ఇస్టదేవుళ్లకు మహాతీర్ధం పొడితో అభిషేకం చేయడండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కొన్ని ముఖ్యమైన విషయాలు గ్రహించగలుగుతారు. పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న స్నేహితులను మీరు గుర్తించగలుగుతారు. తగిన చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండగలుగుతారు.
ధనస్సు
ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. చేయి దాకా వచ్చిన అవకాశాలు వేయి జారిపోవడం చేయి జారిపోతాయి. పసుపు వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఎంతో మందికి సహాయం చేసే వారు మీ దాకా వచ్చేసరికి వెనక్కి తిరుగుముఖం పడతారు. ఎదురుచూపుల ద్వారా నిరాశ ఎదురవుతుంది. కలంకి అనుకూలంగా ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారు.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు ఎంతమంది ఎంత నిరుత్సాహపరిచిన మీ సంకల్ప బలంతో ముందుకి నడవగలుగుతారు. మంచి పరిస్థితులకు స్థాయికి చేరుకోగలుగుతారు. రాత్రికి, రాత్రి ఎవరు కోటీశ్వరులు అవ్వలేరు కదా అందరూ మెల్లగా ఎదిగారు అదే కోణంలో మనం కూడా ఎదుగుతాము అన్న ధైర్యాన్ని కలిగి ఉంటారు. పూజల్లో నాగ సింధూరం కుంకుమను ఉపయోగించండి. మీ వాళ్ళకి మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. ప్రత్యేకంగా వారి స్నేహితుల పట్ల మీకున్న అభిప్రాయాలు మారతాయి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ శ్రేయస్సు కోరి వేరే ఊరికి వెళ్లాలి ఆలోచనలు కలసి వస్తాయి. కుటుంబ పరమైన బరువు బాధ్యతల గురించి అవగాహన కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యం మేరకు సహాయాన్ని అందిస్తారు.
హనుమాన్ వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. సహోదర సహోదరీ వర్గం వారి యొక్క భవిష్యత్తు గురించి చింతించవలసిన ఉంటుంది. అయిన వాళ్ళ ఉండి కూడా సహకరించలేకపోతున్నాము సహాయం అందించ లేకపోతున్నారు అన్ని దిగులు పడతారు.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు మీరంటే ఎంతగానో ఇష్టపడే వ్యక్తి పెళ్లి ప్రస్తావన మీ ముందు ఉంచుతారు. ఎంత ఆలోచించినప్పటికీ అంగీకరించడానికి కానీ నిరాకరించ దానికి కానీ మీకు ధైర్యం సరిపోదు. పెద్దల సమక్షంలో స్థిరాస్తి సంబంధమైన విషయాలు నిర్ణయాలు తెలుసుకోగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నర దిష్టి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం.