Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోయింది.. ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో శుభకార్యాలు విదేశీ పర్యటనలతో పాటు ఎన్నో
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.02.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 04.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : మంగళవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : అశ్విని
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గత స్మృతులు నెమరువేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహిస్తారు. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. విష్ణుధ్యానం చేయండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారాలు ఆప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆలోచనలు. అమలు చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. భూవివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. రుణ బాధల నుంచి విముక్తి, కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు.
మీపై అభిమానం పెరుగుతుంది. కొద్ది కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న పెట్టుబదులు. లాభాలు అందుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం, పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ యానం, మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
మిధునం
ఈ రాశి వారికి ఈ రోజు పనుల్లో ఆటంకాలు. విచిత్రమైన సంఘటనలు స్నేహితులతో ఆకారణంగా విభేదాలు కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత నిరాశాజనకమే. తీర్థ యాత్రలు చేస్తారు.
రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మాటపట్టింపులు ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఔషధ సేవనం. వ్యాపారాలు అంతగా బాభాలు కనిపించవు. నూతన పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగులకు బదిలీలు జరిగే సూచనలు. ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవుల్లో చిక్కులు. మహిళలకు సమస్యలు ఎదురుకావచ్చు. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో జాప్యం. పెరుగుతాయి. శ్రమ మరింతగా పెరిగి మీ సహనాన్ని పరీక్షిస్తుంది. కాంట్రాక్టర్ల యత్నాలు ఫలించవు. ఆస్తి వివాదాలు ముదురుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులు మీపై విమర్శలు చేయడంతో కలత చెందుతారు. కొద్దిపాటి అనారోగ్యం, తద్వారా ఔషధసేవనం వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో నిదానం పాటించాలి. ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహం. అనుకోని బదిలీలు, కళాకారులకు ఒత్తిడులు, మహిళలకు మానసిక ఆందోళన. గణేశునికి అభిషేకం చేయండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. ఎంతగా కష్టపడ్డా ఆకించిన ఫలితం పొందలేరు. వివాదాలు కొన్ని చికాకు వరుస్తాయి. బాధ్యతలతో మరింతగా పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.. అవవాదులు మీడపడవచ్చు. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఒడిదుదుకులు ఎదురవుతాయి. మహిళలకు మానసిక అశాంతి. ఆంజనేయ స్వామికి అర్చనలు మంచిది.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులు, సహచరులతో లేనిపోని విభేదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు. వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో ఆకారణంగా తగాదాలు. కళ్లకు సంబంధించిన రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారులకు సాధారణ లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకున్న బదిలీలు సైతం నిలిచిపోతాయి. విధుల్లో ఒత్తిదులు, కళాకారులకు చిక్కులు పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి, అంగారకుని స్తోత్రాలు పఠించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు ఎదురవుతాయి. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ నిర్ణయాలపై పునరాలోచనలో పడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. బాధ్యతలతో సతమతమవుతారు. రుణబాధలు ఉంటాయి.
సొమ్ము సకాలంలో అందదు. కుటుంబసభ్యులతో ఆకారణంగా విభేదాలు నెలకొంటాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు బాధిస్తాయి.. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరాశానిసృహలు. మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది. సవగ్రహస్తోత్రాలు పరించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వాహనాలు, స్థలాలు కొంటారు.
భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబసమస్యల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. కళాకారులకు సన్మాన, సత్కారాలు, మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. దుర్గామాతను కుంకుమార్చన మంచిది.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. సేవ, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సం. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేతాలు సందర్శిస్తారు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
రెండుమూడు విధాలుగా ధనలాభ సూచనలు, రుణాలు తీరే సమయం. కుటుంబంలో ఉత్సాహంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ యత్నాలకు అందరి ఆమోదం లభిస్తుంది.. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తధ్యం. విస్తరణయత్నాలు సానుకూలం.. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు క్లిష్ణమైన వ్యవహారాలు సైతం పూర్తి కాగలవు. ఆలోచనలు. కార్యరూపం దాలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాఠమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తీర్ధయాత్రలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. రుణాలు తీరతాయి.
కుటుంబంలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాల్లో కొన్ని చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. పదవులు దక్కుతాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు ఆలోచనలు కలసిరావు. అనుకున్న పనులలో ఆటంకాలు, మిత్రులతో మాటపట్టింపులు ఎదురవుతాయి. కాంట్రాక్టులు చేజాడతాయి. తీర్ధయాత్రలు చేస్తారు. విద్యార్ధుల యత్నాలు ముందుకు సాగవు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలలో పునరాలోచన చేస్తారు.
కుటుంబసమస్యలు మరింత పెరిగి సహనాన్ని పరీక్షించవచ్చు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కొన్ని శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఔష్యదసేవనం, వ్యాపారులకు లాభాలు కొద్దిపాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని ఐడలీలు ఉంటాయి. ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు చేజారవచ్చు. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం. రుణవ్యాధలు తొలగుతాయి.
ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సభ్యుల సలహాలు పాటిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య మంచి ఊరట లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. మహిళలకు నూతనోత్సాహం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
టాపిక్