Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి.. ఈ పరిహారాలను పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు..-today rasi phalalu these zodiac signs will get many benefits including job opportunities happiness and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి.. ఈ పరిహారాలను పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు..

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి.. ఈ పరిహారాలను పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు..

HT Telugu Desk HT Telugu
Published Feb 10, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.02.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి

రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : సోమవారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : పునర్వసు

మేషం

కొత్త వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అన్ని సమకూరినప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది భయం గుప్పిట్లో పెట్టుకొని ప్రారంభిస్తారు. చిన్న చిన్న తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నాన మాచరించండి. వ్యాపార కేంద్రాలలో జనాలు రాకపోకలు పల్చబడటం ఆలోచింప జేస్తుంది.

వృషభం

నూతన గృహోపకరణాలను నూతన గృహనికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత ఆశయంనీ నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. సంతానం నుండి సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. సౌర కంకణాన్ని ధరించండి. మొదలు పెట్టిన కార్యక్రమంలో కొంతమంది చేతులు పడగానే అవి వెనక్కి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. ప్రశంసలు అందుకుంటారు.

మిథునం

మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రాలు పట్ల ఆకర్షితులవుతారు. గురువుల పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిరోజు దేవి దేవతలకు ప్రథను తాంబూలాన్ని సమర్పించండి. పుణ్యక్షేత్రాలను సందర్శించా లన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఒకానొక సందర్భంలో ఒక శుభ ఆహ్వానాన్ని అందుకుంటారు ఎంతోమందిని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం

కొంతమంది ద్వారా ప్రేమ సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. స్నేహితుల ద్వారా కొన్ని రాయబారాలు నడిపే ప్రయత్నాలు విరమించుకుంటారు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించక ఉద్యోగం చేయలేని స్థితికి చేరటం మీరు. కచ్చితంగా కొన్ని బాధ్యతలు స్వీకరించే విధంగా ఉంటుంది.

సింహం

కార్యాలయంలో రహస్య సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని ప్రాజెక్టు నిమిత్తం మీ ఆలోచనలు మీ ప్రవర్తన మారుతుంది. నూతన కార్యక్రమాల “పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. సంఘ సేవ కార్యక్రమంలో, దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సర్వ రక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. నేత్ర సంబంధమైన వ్యాధులు కలగవచ్చు అప్రమత్తంగా ఉండండి..

కన్య

నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు ఒత్తిడి మరింత పెరుగుతుంది. పనిచేయలేని విధంగా పరిస్థితులు గోచరిస్తాయి కాలక్రమమైన కొన్ని అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపం వేయండి నర దిష్టి తొలగిపోతుంది. మీ వారి పేరు మీద మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వృత్తి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు.

తుల

కార్యాలయంలో రహస్య సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని ప్రాజెక్టు నిమిత్తం మీ ఆలోచనలు మీ ప్రవర్తన మారుతుంది. నూతన కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. సంఘ సేవ కార్యక్రమంలో, దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సర్వ రక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్థ్నానమాచరించండి. మీ వారితో కలిసి కొన్ని నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. నేత్ర సంబంధమైన వ్యాధులు కలగవచ్చు అప్రమత్తంగా ఉండండి.

వృశ్చికం

పుస్తక పఠనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. చేయాలనుకున్న కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతారు. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న కొన్ని అంశాల పట్ల శుభవార్తను వినగలుగుతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. ఇంట్లో జరగబోయే శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని నెలకొల్పుతాయి. పెట్టిన పెట్టుబదులు యధాతధంగా తిరిగి రావడం మీ మానసిక ధైర్యానికి సంతోషానికి కారణం అవుతుంది.

ధనుస్సు

నూతన గృహ నిర్మాణ ఆలోచన అంతంతమాత్రంగా ఉంటాయి. అడ్వాన్స్ ఇచ్చి వెనుతిరిగే అవకాశం ఉంది. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి సుదుటన ఈ బొట్టును ధరించండి. దూర ప్రయాణాలు తరచుగా ఏర్పడతాయి. వాహన సంబంధమైన అసౌకర్యం కలుగుతుంది. సొంత వాహనం ఉంటే బాగుంటుంది అన్ని ఆలోచనలు జరుపుతారు.

మకరం

కొన్ని కార్యక్రమాలలో మీరు వేసిన అంచనాలు నిజమవడం మానసిక దైర్యానికి కారణం అవుతుంది. పలువురిలో ప్రశంసలను గౌరవం మర్యాదలు అందుకో గలుగుతారు. ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. నవగ్రహాల దగ్గర నవగ్రహ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు పడుతున్న కష్టం శ్రమ చూసి పరాయి వాళ్ళుకు బాధ కలుగుతుంది కాని మీ వాళ్లకు మాత్రం ఏ మాత్రం పట్టదు.

కుంభం

జీవిత భాగస్వామి అలవాట్లకు బానిస అవ్వడం ఏమాత్రం సహించదు. పిల్లల పట్ల శ్రద్ధ లేదు కుటుంబం పట్ల శ్రద్ధ లేదని మీరు ఎంత వాపోయిన వినిపించుకోని పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. పూజల్లో నాగ సింధూరం కుంకుమను ఉపయోగించండి. పెద్దల సమక్షంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు నిర్ణయించుకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి నుంచి అవకాశాలు అందుకోగలుగుతారు.

మీనం

మెడికల్ రిప్రజెంటివ్ కి పనులు మరింత పెరుగుతాయి. ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. అరటి నాడ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కొత్త ఉద్యోగస్తులతో పరిచయం పెంచుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న వారితో ఫోన్ ద్వారా సంభాషణ సాగిస్తారు. కొన్ని కార్యక్రమాలలో పురోగతిని తీసుకురాగలుగుతారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner