Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు, ఆర్థికంగా బాగుంటుంది.. సంతోషంగా ఉంటారు.. మీ రాశి ఎలా ఉందంటే?
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.01.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 27.01.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : సోమవారం, తిథి : కృ. త్రయోదశి, నక్షత్రం : మూల
మేషం
ఈ రోజు ఈ రాశి వారికి అవకాశాలు కలసివస్తాయి. చెల్లింపుల్ని పూర్తి చేసుకొనునట్లు ఆదాయాలుంటాయి. వ్యక్తిగతముగా ఎదిగేందుకు అవకాశాలు సిద్ధించగలవు. ఆత్మీయుల మధ్య సంబంధాలు బలపడతాయి. వివాహాది శుభ కార్య యత్నాల్ని వేగవంతం చేసుకొంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి. వ్యాపారాలు ఊహించుకొన్నట్లు సాగగలవు.
వృషభం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారాలు మిశ్రమ ఫలమివ్వగలవు. ఊహించనివిధంగా ప్రణాళికలలో మార్పు-చేర్పులు ఏర్పరచుకొంటారు. ఖర్చులు అంచ నాల్ని మించినా సంతృప్తినిస్తాయి. పెద్దలు అధికారు లతో ఏర్పడిన అభిప్రాయభేదాలు సద్దుమణుగుతాయి. స్థిరాస్తుల నిర్ణయాల్లో పునరాలోచనలతో వ్యవహరించు కోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి.
మిథునం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారములు చిన్నతరహా ఆటుపోటులకు గురిచేయగలవు. స్థాయిని తగ్గించుకొని వ్యవహరించుకొన్న విమర్శల్ని ఎదుర్కోవలసివుంటుంది. ఆదాయాలు ఎప్పటిలాగే ఉంటూ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలకై చేసే ప్రయత్నాల్లో మీ ప్రయత్నాలందు పునరాలోచ నలు చేయవలసిరావచ్చును. గుర్తింపులకు యత్నించుకోక ఉద్యోగాలలో బాధ్యతగా వ్యవహరించుకోండి.
కర్కాటకం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహ సంచారాలు ప్రతికూలమైనా సంతృప్తిని ఏర్పరచుకోగలరు. అన్నిటా ఆలోచనాత్మకంగా వ్యవహ రించుకుంటారు. పనుల్ని పట్టుదలలతో పూర్తిచేసు కొంటారు. కుటుంబ వ్యవహారాల్ని అనుకూలింప చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తప్పని సరి చేయండి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు లాభ ఆలోచనలకు దూరంగా ఉంటూ బాధ్యతగా సాగండి.
సింహం
ఈ రోజు ఈ రాశి వారికి పనులు పూర్తగుటకు పట్టుదలలు అవసరం, ఉత్సాహాలు సంతృప్తినిచ్చు స్థితులు దూరంగా ఉంటాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించుకోగలరు. విమర్శకులకు దూరంగా ఉంటూ సాగాల్సి వుంటుంది. ఖర్చులు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటాయి. ఇతరుల్ని నమ్మి పనుల్ని చేపట్టుకోకండి. ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచుటయే మంచిది.
కన్య
ఈ రోజు ఈ రాశి వారికి సంతాన వ్యవహారాల్లో చిన్న తరహా జాగ్రత్తలు అవసరం. ఇతరులు గుర్తించుట లేదను వెలితిభావాలను పెరగనీయకండి. స్వయం కృషితోనే మీరు చేపట్టుకొన్నవి పూర్తిచేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులను చెల్లింపులను పూర్తిచేసుకుంటారు. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయాలు చూపుకోవాలి. వివాహ, ఉద్యోగ, యత్నాల్లో నిరీక్షణలతో సాగాల్సివుంటుంది.
తుల
ఈ రోజు ఈ రాశి వారికి మీ ప్రతిభకు గుర్తింపులేర్పరచుకొను అవకాశాలు ఏర్పడతాయి. ఖర్చులందు జాగ్రత్తలు చూపుకోండి. బంధుమిత్రులతో ముఖ్యమైన వ్యవహా రాల్లో సంప్రదింపు విధానంతో సాగగలరు. ఆదాయాలందు చిన్నతరహా మార్పులు చూస్తారు. గతంలో రావనుకొన్నవాటిలో కదలికలు ఏర్పడతాయి. పొదుపు మొత్తాలు చేతికి అందుతాయి. ప్రణాళికాయుతంగా సాగి ప్రయత్నాలను వేగం చేసుకోగలరు.
వృశ్చికం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహ సంచారాలు ఉపకరిస్తాయి. ప్రయత్నాలను అనుకూలింపచేసుకుంటారు. చిన్న చిన్న అవకా శాలు కలసివస్తాయి. అధికారులు, పెద్దలు వంటివారు సహకరిస్తారు. అనుకొన్న లక్ష్యాలకై ప్రయత్నాలను వేగవంతం చేసుకుంటారు. కుటుంబంలో ఏకవాక్యత లపై వ్యవహరించుకోవాలి. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు అనుకూలం.
ధనుస్సు
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారాలు ప్రతి కూలములిచ్చేవైనా పనులు వేగవంతం అవుతాయి. ఆలోచనలు యథాతథంగా అమలుచేయక పునర్విచారాలు చోటుచేసుకొనేలా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. ఆదాయం బాగానే ఉంటుంది. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా సాగండి.
మకరం
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. సహకరించే వ్యక్తులను దూరం చేసుకొనే సూచనలున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకోసం కుటుంబంలో ఇబ్బందులను గురిచేయు అవకాశాలున్నాయి. స్థిర, చరాస్తులపట్ల మక్కువ చూపగలరు. వాహన, యంత్రాదుల రిపేర్లకు గురికాగల సూచనలున్నాయి. అధికారులతో ఆలో చనలతో సాగాలి. మిత్ర సహకారాలు తీసుకుంటారు.
కుంభం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారాలు సామాన్య ప్రయోజనమిచ్చేవైనా పట్టుదలలు చూపగలిగితే ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి. ఖర్చులను తగ్గించుకొంటూ రుణభారాలు పెరగకుండా జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలకై పట్టుదలలు చూపుకోవాలి. విద్యార్థులకు వ్యాసం గాలు చురుకుగా సాగుతాయి.
మీనం
ఈ రోజు ఈ రాశి వారికి గ్రహ సంచారాలు సుమారు ఫలితం ఇస్తాయి. వ్యక్తిగత అవసరాలను సమర్థించుకోగలుగు తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ వ్యక్తులచే సహకారాలు ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. బాధ్యతలలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు అవ సరం. ఆరోగ్యం అనుకూలం.
టాపిక్