Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. మీ రాశి ఎలా వారికి ఉందో చూసారా?-today rasi phalalu these zodiac signs will get happiness and problems will go away check how is your day and zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. మీ రాశి ఎలా వారికి ఉందో చూసారా?

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. మీ రాశి ఎలా వారికి ఉందో చూసారా?

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 31.01.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి

రాశిఫలాలు (దిన ఫలాలు) : 31.01.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : శుక్రవారం, తిథి : శు. విదియ, నక్షత్రం : శతబిష

మేషం

ఈ రాశి వారు ఈ రోజు కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. చెల్లిం పుల్లో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. నోటీసులు అందుకుంటారు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.

వృషభం

ఈ రాశి వారు ఈ రోజు ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ము ఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరి స్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయా లకు ప్రాధాన్యమివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.

మిథునం

ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికలావాదేవీలు ముగు స్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.

కర్కాటకం

ఈ రాశి వారు ఈ రోజు నిరాశాజనకం. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురి కావద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడ తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి.

సింహం

రాశి వారు ఈ రోజు లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్ని హితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. యోగ, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య

ఈ రాశి వారు ఈ రోజు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉల్లాసంగా గడుపుతారు. ఆచితూచి అడుగేయాలి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

తుల

రాశి వారు ఈ రోజు సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలతో సతమతమవు తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోబాలకు లొంగవద్దు. ధనం. మితంగా వ్యయం చేయండి. పత్రాల్లో సవ రణలు సాధ్యమవుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.

వృశికం

ఈ రాశి వారు ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించి నట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.

ధనుస్సు

ఈ రాశి వారు ఈ రోజు యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మకరం

ఈ రాశి వారు ఈ రోజు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసు కోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్య వర్తులను ఆశ్రయించవద్దు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.

కుంభం

రాశి వారు ఈ రోజు లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. మాట నిలబెట్టు కుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమను కున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి.

మీనం

ఈ రాశి వారు ఈ రోజు శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్న గిల్లుతుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. తరచూ ఆప్తులతో సంభాషిస్తారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000