Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారు ఈ పరిహారాలను పాటిస్తే.. సమస్యలు తగ్గుతాయి.. నూతన అవకాశాలు, లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఎన్నో-today rasi phalalu these zodiac signs should follow these remedies to be healthy and these will gets wealth new chances ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారు ఈ పరిహారాలను పాటిస్తే.. సమస్యలు తగ్గుతాయి.. నూతన అవకాశాలు, లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఎన్నో

Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారు ఈ పరిహారాలను పాటిస్తే.. సమస్యలు తగ్గుతాయి.. నూతన అవకాశాలు, లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Jan 28, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.01.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారు ఈ పరిహారాలను పాటిస్తే.. సమస్యలు తగ్గుతాయి
Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారు ఈ పరిహారాలను పాటిస్తే.. సమస్యలు తగ్గుతాయి

రాశిఫలాలు (దిన ఫలాలు) : 28.01.2025

సంబంధిత ఫోటోలు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : మంగళవారం, తిథి : కృ. చతుర్దశి, నక్షత్రం : పూర్వ ఆషాడ

మేషం

ఈ రాశి వారికి ఈ రోజు వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలుగు బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణం తో సర్వరక్షా చూర్ణం కలిపి స్థ్నానం చేయండి (తలస్నానం చేయరాదు). సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్దను కనబరుస్తారు. పొదుపు చేసిన ధనాన్ని కొత్త పెట్టుబడులకుగాను పెట్టుబడిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. తనఖాలను విడిపించగలుగుతారు.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులకు మధ్యస్త ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోనికి తీసుకొనండి. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

అగ్రిమెంట్లు ముఖ్యమైన సంతకాలు చేసేటప్పుడు సాంకేతిక లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి.. సినీ, కళా, సాహిత్య రంగాలలోని వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి పెరుగుతుంది అన్నప్పటికీ ఒకే సమయంలో 2 లేక 3 ప్రాజెక్ట్స్ చేపడతారు.

మిథునం

ఈ రాశి వారికి ఈ రోజు తాత్కాలికంగా ఏర్పడుతున్న అవాంతరాలను పరిగణలోనికి తీసుకొనక పోవడం మంచిది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. అయితే ఇది తాత్కాలిక మైనవి అయివుంటాయి, ఊహాజనితమైన మాటలతో మిమ్మల్ని నమ్మించడం కష్టతరమని ఇతరులు తెలుసుకోగలుగుతారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి, ఇది ఎంతో విశిష్టమైనది. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. తనఖా వస్తువులు విడిపించు కోగలుగుతారు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. డ్రైవింగ్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. రచన ప్రాధాన్యంగా కలిగినటువంటి రంగంలోని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.

నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రు బాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. నూతన పరిచయాలు ఏర్పడతాయి, ఉపయుక్తంగా పరిణమిస్తాయి. మంచి చెడులను విడమరచి చెప్పే సన్నిహిత వర్గం ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు.

సింహం

ఈ రాశి వారికి ఈ రోజు సెంటిమెంట్ వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధ "సిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి గృహం, వాహన అమ్మకాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. ఎదుటి వారు మీరు చెప్పేది ఆసాంతం వినకుండా మీ మీద నిందలు వేయడం అసహనానికి గురి చేస్తుంది.

కన్య

ఈ రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత విషయములను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. బాధ్యతలు అధికమవడం వలన శ్రమ అధికంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎదుటివారి నిర్లక్ష్యం మనకి ప్రమాదం గా మారవచ్చు. బహుమతులు ఇవ్వాలన్న ఆలోచనలు ముడిబడతాయి..

తుల

ఈ రాశి వారికి ఈ రోజు మోసాలు చేసే వారిని పసిగట్ట గలుగుతారు. కొన్ని సందర్భాలలో ఏమీ మాట్లాడ లేని పరిస్థితులు నెలకొంటాయి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆపద్ధర్మంగా అబద్ధాలు చెబుతారు. వాహనాన్ని అమ్మి కొత్తది కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దీనికి తగిన వ్యక్తులను ఎంచుకుంటారు. వారికి సమాచారాన్ని అందజేస్తారు. దైవదర్శనాలు చేసుకో గలుగుతారు. విహార యాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శన చేసుకుంటారు.

వృశ్చికం

రాశి వారికి ఈ రోజు ఈ వారం జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించిన గలుగుతారు. ప్రయోజనకరమైన అంశాలను గ్రహిస్తారు. మహా పాశుపత కంకణం ధరించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రులతో చర్చలు, సమావేశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీకు రావాల్సిన టువంటి బాకీలు గురించి గల ప్రస్తావన ఎవరికి నచ్చకపోవచ్చు ఏదో ఒక విషయంతో మాట దాటే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.

ధనస్సు

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ పలుకుబడిని పరపతిని ఎంతగానో ఉపయోగిస్తారు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెడతారు. లిఖితపూర్వకమైన పత్రాల పట్ల ఖచ్చితమైన శ్రద్ద చూపించండి. మెడలో కాలభైరన రూపు ధరించండి. వ్యాపారంలో చేసే మార్పులు అనూహ్యంగా కలిసి వస్తాయి. కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మకరం

ఈ రాశి వారికి ఈ రోజు కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాధకి భాగోద్వేగాలకి కారణమవుతుంది. స్నేహితుల సహాయము సహ ఉద్యోగుల సహాయము కొంతమేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కీళ్ల నొప్పులు నేత్రవ్యాధులతో అవస్థ పడే అవకాశం

కుంభం

రాశి వారికి ఈ రోజు శుభకార్యాది విష వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు దీనికి తగిన సమాధానాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని వెనువెంటనే తెలియజేయవలసిన పరిస్థితి నెలకొంటుంది. కుక్కలకి చపాతీలు తినిపించండి. పక్షులకి నీళ్లని పెట్టండి. అరటి నార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృత్తి రీత్యా కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు ఏర్పడతాయి. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు కాపురంలో చిచ్చు పెట్టే వారిని గుర్తిస్తారు. వీరి పట్ల మీ ప్రవర్తన మారుతుంది. ఇలాంటి వాళ్ళకి అవకాశం, ఆశ్రయము ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంటారు. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. రుణ బాధల నుండి బయటపడడానికి గాను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తారు కొన్ని దర్భాలల్లో సందర్భాలలో చేతిలో ఉన్న ఆస్తిని అమ్మి ఈ బాధల నుంచి బయటపడాలని ఆలోచన చేస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner