Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అధిక ఖర్చులు, మానసిక ఒత్తిడి.. మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..?-today rasi phalalu these zodiac sign will get difficulties including wealth mental stress and more check how is yours ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అధిక ఖర్చులు, మానసిక ఒత్తిడి.. మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..?

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అధిక ఖర్చులు, మానసిక ఒత్తిడి.. మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..?

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 26.01.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అధిక ఖర్చులు, మానసిక ఒత్తిడి (freepik )

రాశిఫలాలు (దిన ఫలాలు) : 26.01.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : ఆదివారం, తిథి : కృ. ద్వాదశి, నక్షత్రం : జ్యేష్ట

మేషం

ఈరోజు ఈ రాశి వారికి గత మాసం కంటే వృత్తివ్యాపారాల్లో అనుకూలత కల్గుతుంది. మీ సామాజికపరిధి గౌరవ ప్రదంగా విస్తరింపబడుతుంది. దూరప్రయాణాలు, ఖర్చులు తప్పవు. ఉదర రక్తసంబంధ అనారోగ్యమునకు చికిత్స అవసరమవుతుంది.

వృషభం

ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు. విదేశీవీసాలు, ఇతర దేశప్రయాణాలు కలసి వస్తాయి. ధైర్యంతో కార్యసిద్ధి కల్గుతుంది. విద్యా వికాసం కల్గుతుంది. రక్తపోటు నియంత్రణ విషయంలో శ్రద్ధ అవసరం. ధనం నిల్వచేస్తారు.

మిథునం

ఈరోజు ఈ రాశి వారికి మీ ఆశయాలను, లక్ష్యాలను మననం చేసుకుని, అవరోధాలను అధిగమించి, సహనం మరియు శాంతస్వభావంతో అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. వాహనచోదకులు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం

ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికవిషయాల్లో శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మీ ఉద్యోగ జీవితంలో సమస్యలు, కొంత మానసిక ఒత్తిడి, వాదనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి.

సింహం

ఈ రాశి వారికి విలాసాలను అనుభవిస్తారు. సమస్త కోరికలు నెరవేరుతాయి. సంపద, ఆస్తి కూడబెట్టు కునే అవకాశం ఉంది. ఆస్తి, పేరు, కీర్తి, మంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచిఆరోగ్యం కల్గుతాయి.

కన్య

ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల నిరంతరభయం. మార్గావ రోధాలను నిరోధించుటకు దూరప్రయాణాలు మానండి. అధికారుల వలన గానీ లేదా ప్రభుత్వం నుండి గుర్తింపు లేదా ప్రతిఫలం వస్తుంది.

తుల

ఈరోజు ఈ రాశి వారికి రావలసిన బాకీలు వసూలు అవుతాయి. సోదరవర్గంవారి అండదండలుంటాయి. ప్రణాళికలతో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. పుత్రసంతానప్రాప్తి. కోర్టువిషయాలు అనుకూలం.

వృశ్చికం

ఈరోజు ఈ రాశి వారికి న్యాయస్థానాల చుట్టూ తిరగడం, ధన వ్యయం, బంధనయోగం పొంచి ఉంది. తల నొప్పి, కంఠం సంబంధిత అనారోగ్య సూచనలు. నెలాఖరునుంచి సుబ్రహ్మణ్య ఆరాధన, అభిషేకం ఉపశమనాన్ని ఇస్తుంది.

ధనుస్సు

ఈరోజు ఈ రాశి వారికి అధికార హోదా పెరగడం, ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం సామాన్యం. గృహమున శుభకార్యాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా అనుకూలం.

మకరం

ఈ రాశి వారికి గతంనుంచి పేచీలతో సాగుతున్న వైవాహికబంధాలు ఒక కొలిక్కి వచ్చి విముక్తు లవుతారు. సహనాన్ని అలవరచుకోవడం మంచిది.

కుంభం

ఈరోజు ఈ రాశి వారికి పై అధికారులు మిమ్ములను ప్రశంసిస్తారు. పలుకుబడి, గుర్తింపు పొందుతారు. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజికపరంగాకూడా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలం.

మీనం

ఈ రోజు ఈ రాశి వారికి జీవితం ఉల్లాసంగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆదాయాన్ని మరియు వృద్ధిని పొందు తారు. జీవితభాగస్వామితో మీ సంబంధంకూడా మధురంగా మరియు మృదువైనదిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్పశక్తిని పెంచుతుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ