Rasi Phalalu:ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది, ఉల్లాసంగా గడుపుతారు, వివాహయత్నం ఫలిస్తుంది, మీ రాశిఫలాలు చూసుకున్నారా?
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.02.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 07.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : శుక్రవారం, తిథి : శు. దశమి, నక్షత్రం : రోహిణి
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. మీఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమతో కూడిన ఫలితాలు న్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పిల్లల భవిష్యతుపై దృష్టిపెడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారం బాగుంది. కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. ప్రతి విషయం లోనూ అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల వాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. దైర్యంగా యత్నాలు సాగిస్తారు.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రుణసమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహ పరుస్తుంది. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పెద్దమొత్తం దన సహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులు మీ ఆలోచనలను నీరు గార్చేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనులు వేగవంతమం పుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదా నంగా ఫలిస్తుంది. ప్రణాళికలు వేసు కుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. బుధవారం నాడు నగదు, పత్రాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పరిచయస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు ఆటుపోట్లను సమర్థంగా ఎదుర్కొంటారు. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితులతో సంబా షిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయా లకు కుంగిపోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి కలుగుతుంది.
టాపిక్