Today Rasi Phalalu : ఈ రాశివారికి అనుకూలంగా లేదు.. ప్రయాణాలు చేయెుద్దు-today rasi phalalu telugu check your astrology for tuesday 12th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu Telugu Check Your Astrology For Tuesday 12th September 2023

Today Rasi Phalalu : ఈ రాశివారికి అనుకూలంగా లేదు.. ప్రయాణాలు చేయెుద్దు

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 12.09.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి .

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 12.09.2023, వారం: మంగళవారం, తిథి : త్రయోదశి నక్షత్రం : ఆశ్లేష, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పనిభారం ఎక్కువై మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం. వృత్తి ఉద్యోగాలలో పైస్థాయి వారి వలన సమస్యలు. మీ సహ ఉద్యోగులతో, స్నేహితులతో, మీ తోటివారితో, తల్లిదండ్రులతో అవగాహనలోపం వలన సమస్యలు ఏర్పడును. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ తోటివారితో విభేదాలు. మాతృమూలక అనారోగ్యములు లేదా కలహములకు దారి తీయవచ్చు. ప్రస్తుత వ్యాపార లావాదేవీలు పనికిరావు. మానసికపరమైన ఒత్తిడి లేదా ఆస్తి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలుగును. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబముతోను, స్నేహితులతో ఉద్రిక్తత సమస్యలు కలుగుచేయును. రుణాలు ఇవ్వడానికి రుణం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించును. ప్రయాణాలు కలసివస్తాయి. సంతానంతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలించును. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికము. చెడు సావాసాలను వదులుకొనుట మంచిది. దూర ప్రయాణాలు అనుకూలించవు. ఉద్యోగంలో సమస్యలు వేధించును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలం ఉన్నది. ఆకస్మిక ధనలాభము. అనవసర ఖర్చులు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్యోగం అనుకూలించును. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉ ద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు. సోదరులు, స్నేహితులు మీకు సహకరిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలిస్తాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఒత్తిడిని అధిగమిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా బలపడతారు. మీరు తీసుకునే నిర్ణయాలతో విజయం సాధిస్తారు. మంచి ఆదాయం కలుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఉద్యోగస్తులకు స్తానమార్పిడి, విద్యార్థులకు విదేశీ విద్య, నూతన అవకాశాలు కలుగును. దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య గొడవలకు తావులేకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. వైద్యులను సంప్రదించాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థం. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చేసే ప్రతి పనిలో సమస్యలు, ఇబ్బందులు కలుగును. మానసిక ఒత్తిడి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయం. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్దాదేవిని పూజించండి.

WhatsApp channel