నవంబరు 17, 2023: నేటి రాశి ఫలాలు.. ఇతరులతో మాట్లాడటం శ్రీమతికి నచ్చకపోవచ్చు-today rasi phalalu november 17th 2023 friday check your zodiac sign astrological prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబరు 17, 2023: నేటి రాశి ఫలాలు.. ఇతరులతో మాట్లాడటం శ్రీమతికి నచ్చకపోవచ్చు

నవంబరు 17, 2023: నేటి రాశి ఫలాలు.. ఇతరులతో మాట్లాడటం శ్రీమతికి నచ్చకపోవచ్చు

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 04:05 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 17 నవంబరు 2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 17 నవంబరు 2023 శుక్రవారం
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 17 నవంబరు 2023 శుక్రవారం (Pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 17.11.2023

వారం: శుక్రవారం, తిథి: చవితి,

నక్షత్రం: పూర్వాషాఢ, మాసం: కార్తీకం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్త్రీలు విందులు, వినోదాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఖర్చులు అధికమగును. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఎదుటివారితో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయభారాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి అంత అనుకూలంగా లేదు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు అనుకూల సమయం. విద్యార్ధినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథునరాశి

మిథునరాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. విందులలో పరిమితి పాటించండి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

కర్కాటక రాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ పరిశోధనా రంగాల వారికి ఆశాజనకం. విందుల్లో అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గృహమార్చిడి యత్నాలు అనుకూలిస్తాయి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. సంగీత, నృత్య, సాహిత్య కళాకారులకు గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విదేశీయానం, తీరయాత్రలకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, చిరువ్యాపారులకు అనుకూలం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్చ ఆటంకాలు కలుగుతాయి. నూతన పరిచయాలు, వ్యాపకాలు తప్పు దారి పట్టించేందుకు ఆస్కారముంది. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు శ్రమాధికం, ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడును. వస్త్రాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. విందులు, వినోదాల్లో అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా అనుకూలించును. నిరుద్యోగులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొంతమంది మీనుండి ధనసహాయం కోరవచ్చు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు ఇంటా, బయటా ఆమోదం లభిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. వివాహ సంబంధాలు నిశ్చయవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లాయర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ సమయం. విద్యార్థులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకున్నా ఫలితం ఉండదు. ఫ్యాన్సీ, మందులు, వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, చికాకులు తప్పవు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వైద్య సలహా, మందులు వాడటం తప్పదు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి.

మకర రాశి

మకర రాశివారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. పాత మిత్రుల కలయికతో కొంత ఉత్సాహానికి గురవుతారు. ఎదుటివారితో ఆచితూచి సంభాషిస్తారు. హోటల్‌, తినుబండారాల వ్యాపారులకు అనుకూలం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్చులకై చేయు ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల కారణంగా చిక్కులో పడే ఆస్మారం ఉంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్‌ రంగాల వారికి అనుకూలం. కుటుంబసౌఖ్యం. రుణ విముక్తి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేసే ప్రయత్నాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. ధనవ్యయం. విరాళాలిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. వ్యాపారాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

WhatsApp channel