ఈరోజు ఈ రాశుల వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రావు.. సంతోషంగా ఉండచ్చు!-today rasi phalalu mesha rasi to meena rasi may 7th wednesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు ఈ రాశుల వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రావు.. సంతోషంగా ఉండచ్చు!

ఈరోజు ఈ రాశుల వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రావు.. సంతోషంగా ఉండచ్చు!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.05.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 07.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : బుధవారం, తిథి : శు. దశమి, నక్షత్రం : పుబ్బ

మేష రాశి

మేష రాశి వారికి వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి, మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోబాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కారమవుతాయి.

మిధున రాశి

ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సోమవారం నాడు పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సెల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసు కుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అధికం. పనులు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.

కన్య రాశి

ఈరోజు అనుకూలదాయకం, మనోదైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.

తుల రాశి

తుల రాశి వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు పట్టుదలతో శ్రమిస్తేనే పనులు సానుకూలమవుతాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ధన సహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్థతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

మకర రాశి

కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బందుమిత్రులకు మీపై అభిమానం కలుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి విశేషమైన ఫలితాలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా ఆడుగు ముందుకేస్తారు. కీలక విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పిల్లల విజయం ఉత్సాహపరుస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు.

మీన రాశి

సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. దైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ