ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం.. గులాబీ, ఆకుపచ్చ అదృష్ట రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి!-today rasi phalalu mesha rasi to meena rasi may 4th sunday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం.. గులాబీ, ఆకుపచ్చ అదృష్ట రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి!

ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం.. గులాబీ, ఆకుపచ్చ అదృష్ట రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి!

HT Telugu Desk HT Telugu

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.05.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 04.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : ఆదివారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : పుష్యమి

మేష రాశి

మేష రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. చివరలో బంధు నిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాజీ, లేత ఆకుపచ్చ అదృష్ట రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రారంభంలో ఆనారోగ్యం, నీలం, ఆకుపచ్చ అదృష్ట రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిధున రాశి

మిధున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. వాహనాలు, భూముల కొనుగోలు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు, అనారోగ్యం. ఆకుపచ్చ నలుపు అదృష్ట రంగులు. దేవీ ఖడ్గమాల పఠించండి.

కర్కాటక రాశి

పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. అందరిలో ఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు, ఎరుపు, తెలుపు అదృష్ట రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారు కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు, స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పడు. పసుపు, నేరేడు అదృష్ట రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం ముడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు, ఎరుపు, నేరేడు అదృష్ట రంగులు, శివాష్టకం పఠించండి.

తుల రాశి

తుల రాశి వారు ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వ్యాపారాలు కొంత మెరుగుపడతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. మధ్యలో వ్యయప్రయాసలు, గులాబీ, నీలం అదృష్ట రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు, విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. చివరిలో వృథా ధనవ్యయం. ఆనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు అదృష్ట రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యవరంగా కొద్దిపాటి చికాకులు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. ప్రారంభంలో శ్రమాధిక్యం. పసుపు, ఆకు పచ్చ అదృష్ట రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకర రాశి

మకర రాశి వారికి ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం, బంధువులతో మాటపట్టింపులు, గులాబీ, నేరేడు అదృష్ట రంగులు, దత్తాత్రేయుని ఆరాధించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారి ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం, మధ్యలో కుటుంబంలో సమస్యలు, నీలం, లేత ఆకుపచ్చ అదృష్ట రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు, కొత్త రుణాలు కోసం యత్నాలు, ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు, వ్యాపారాలలో అశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. మధ్యలో ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ అదృష్ట రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.