Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఇబ్బందులు.. కీలక విషయాల్లో ఆశ్రద్ధ వద్దు, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి!-today rasi phalalu mesha rasi to meena rasi march 9th sunday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఇబ్బందులు.. కీలక విషయాల్లో ఆశ్రద్ధ వద్దు, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి!

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఇబ్బందులు.. కీలక విషయాల్లో ఆశ్రద్ధ వద్దు, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి!

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 09.03.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : ఆదివారం, తిథి : శు. దశమి, నక్షత్రం : పునర్వసు

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో అవసరం తీరుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందు కుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉంటుంది. పొదుపు ధనం అందుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.

మిధున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పిల్లల చదువుల పై దృష్టిపెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్ప కుండా పాటించండి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు సర్వత్రా అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారు ఈ రోజు ఆశయ సాధనకు మరింత శ్రమించాలి. దైర్యంగా ముందుకు సాగండి. అపోహలకు తావివ్వవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ రోజు ఆర్ధికంగా బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. సన్ని హితులతో సంప్రదింపులు జరుపుతారు. అనవసర జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం బాగుంది. దైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృథా కాదు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. అర్దాంతరంగా నిలిపి వేసిన పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నోటీసులు అందుకుంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారిదే ఈ రోజు ప్రతి విషయంలోనూ పైచేయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబందాలు బలపడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు బాధ్యతలను సమర్థంగా నిర్వ హిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబందాలు నెలకొంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. కీలక విషయాల్లో ఆశ్రద్ధ తగదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో మంచి జరుగుతుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించ వద్దు. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం