Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంతోషం ఉంటుంది.. కుటుంబంలో తీర్థయాత్రలు, ఆర్థిక లాభాలతో పాటు ఎన్నో-today rasi phalalu mesha rasi to meena rasi march 8th saturday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంతోషం ఉంటుంది.. కుటుంబంలో తీర్థయాత్రలు, ఆర్థిక లాభాలతో పాటు ఎన్నో

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంతోషం ఉంటుంది.. కుటుంబంలో తీర్థయాత్రలు, ఆర్థిక లాభాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.03.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (freepik )

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : శనివారం, తిథి : శు. నవమి, నక్షత్రం : ఆరుద్ర

మేష రాశి:

మేష రాశి వారు కొన్ని చికాకుల్ని ఎదుర్కోవలసివుంటుంది. ధైర్యంగా ప్రయత్నాలను ముందుకు నడిపించగల్గుతారు. ఆర్థికంగా మంచి ప్రణాళికాయుతముగా వ్యవహరించుకొని రెట్టించిన ఉత్సాహమును చూపగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసాపూర్వక ప్రోత్సాహాలుంటాయి. శారీరక శ్రమలు పెరుగుతాయి. బంధుమిత్రుల అను కూల వైఖరి మంచి మార్పునివ్వగలదు. నూతన వ్యాపార, వ్యవహార ప్రారంభములు వారమంతా ఉంటాయి. సామాన్య అనుకూలతలు ఉంటాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారు అన్నిటా పట్టుదలతో ఉండాలి. ఆర్ధిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. కొన్ని ఒత్తిడులను ఎదుర్కోవలసి వుంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సంయమునాలు చూసి సాగాల్సి వుంటుంది. విద్యార్థులు వ్యాసంగాల పట్ల అంకితభావాలు చూపుకోవాలి. కుటుంబంలో తీర్థయాత్రలు చేపట్టుకుంటారు. అనారోగ్యభావనలను ఎదుర్కోవలసి వుంటుంది. అన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి:

మిథున రాశి అనుకున్న దానిని పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిని పొందుతారు. ఋణదాతలు ఒత్తిడులుంటున్నా అదనపు ఋణాల్ని తీసుకోగల్గుతారు. ప్రెస్టేజికి ఖర్చులు, దానాలు చేయవలసి రావచ్చును. భూ లావాదేవీలకు పరిష్కారం పొందగలరు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. తోటివారితో ఉన్న సమస్యలకు పరిష్కారాలు పొందు తారు. అన్నిటా జాగ్రత్తలు అవసరం.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి ప్రయత్నాల్ని వేగవంతం చేసుకొనుటలో సంతృప్తిని పొందుతారు. ఎదుటివారి ఆంతర్యములు తెలుసుకొని వ్యవహరించుకోవలసి వుంటుంది. చిన్న తరహా అనారోగ్యభావనలు ఎదుర్కోవలసి వుంటుంది. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా రావలసినవి కొన్ని వాయిదా పడడం, కొన్ని ఊరించుటవంటివి ఉంటాయి. వ్యాపార, వ్యవహారాలలో రొటేషన్లకు ప్రాధాన్యతనిచ్చుకోండి.

సింహ రాశి:

సింహ రాశి వారి గ్రహ సంచారములు మిశ్రమముగా ఉన్నాయి. ప్రతీ విషయమును సమర్థించుకోవలసి వస్తుంది. దేనినీ తేలికగా తీసుకోకండి. ఆధ్యాత్మికంగా వ్యవహరించుకోవలసివున్నా సమయ సందర్భాలు కలసిరాని స్థితులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. మధ్యవర్తిత్వములు నిర్వహించే వారిని అతిగా విశ్వసించకండి. ఆర్థిక సర్దుబాట్లుంటాయి. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం.

కన్య రాశి:

కన్య రాశి వారికి గ్రహసంచారాలు అనుకూలం. ఊహించుకొన్నవి పూర్తి చేసుకుంటారు. బంధువర్గంతో ఉత్సాహాలు పంచుకుంటారు. పనులను, కార్యక్రమాలను అను కొన్నవిధంగా పూర్తిచేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో సంప్రదింపులు తప్పని సరి చేయండి. ఆత్మీయుల వ్యాఖ్యానాలు కొన్ని ఇబ్బంది పెడతాయి. వివాహ యత్నాలు అనుకూలించుట, కొందరికి నిశ్చితార్థాలు ఉంటాయి. నిరుద్యోగులకు, విద్యార్థులకు మంచి రోజులు.

తుల రాశి:

తుల రాశి వారికి గ్రహ సంచారాలు 3 వంతులు అనుకూలం. ఆర్థిక సమర్ధనలు అవసరమవు తాయి. బంధుమిత్ర వర్గంచే ఉత్సాహాలు పొందుతారు. సహకరించువారు, ఇచ్చిపుచ్చుకొనువారు పెరుగుతారు. పెద్ద మొత్తములతో కూడిన వ్యవహారాల్ని కొంతకాలం వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలు చేయవలసిరావచ్చును. గౌరవాల్ని కోరుకోకుండా సామరస్యతలు చూపుకోవలసివుంటుంది. వృత్తి, ఉద్యోగ యత్నీకులకు ఊహించుకొన్నవి ఏర్పడతాయి. ఆధ్యాత్మికతలను తప్పనిసరి చేసుకోవాలి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు ఊహాత్మకంగా వ్యవహరించుకుంటారు. ప్రయత్నాలందు అనుభవజ్ఞుల సలహాలను పొందుతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసర ఖర్చులు, ఆత్మన్యూనతా భావాలు ఉండకుండా జాగ్రత్తపడాలి. అనారోగ్య భావనలలో ఉపేక్షణలుండకుండా జాగ్రత్తలు వహించుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో రొటేషన్లకే ప్రాధాన్యతనిచ్చుకోండి. సంతానానికి శుభాలు ఏర్పరచగలరు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి రెండు గ్రహ సంచారములు అనుకూలం. ఊహించుకొన్న వాటిని సాధించుకుంటారు. స్థిరాస్తులు (భూ-గృహాలు) వంటి వాటికై చేయు ప్రయత్నాలు ఉపకరిస్తాయి. బంధు వర్గంలో శుభకార్య నిశ్చయాల వంటి విషయాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రభుత్వ తరహా చెల్లింపులు పూర్తి చేసుకుంటారు. నూతన వ్యాపార వ్యవహారాలను చేపట్టుకుంటారు. గతంలో జరిగిన పొరపాట్లకు దిద్దుబాట్లు ఏర్పరచగలరు.

మకర రాశి:

మకర రాశి వారికి వాగ్విషయాలలో జాగ్రత్తలు అవసరం. తరచూ ఒత్తిడికి లోనవుతారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిచ్చినా తెలియని వెలితికి లోనవుతారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేయువారు ఆచితూచి సాగాల్సి వుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంయమనాలు తప్పనిసరి చేయండి. ఆర్థికంగా సామాన్య స్థితులుంటాయి. ఆధ్యాత్మికతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన వ్యాపారపు ఆలోచనల్ని అమలులో పెడతారు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు అనారోగ్యభావనలు ఎదుర్కోవలసివచ్చినా ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. కుటుంబ వ్యక్తుల సహకారాలు ఉంటాయి. విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు. సంతానపు భవిష్యత్తుకు చెందిన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో అన్యవిషయక చర్చలు ఉండకుండా జాగ్రత్త పడండి. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు వ్యాసంగాలను ఏకాగ్రతతో చేపట్టుకోవాలి.

మీన రాశి:

మీన రాశి వారికి సామాన్య అనుకూలతలు ఉంటాయి. నూతన పనులను చేపట్టుటకు ఆలోచనలు అవసరం. అధికారులతోను, పెద్దలతోను సంయమనాలు చూపు కోండి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా పడు సూచనలున్నాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు సామాన్యతలు ఉండి అనుభవజ్ఞుల సూచనలు పొందుతారు. బంధుమిత్రులతో తగ్గివుంటూ ఒత్తిడులు ఏర్పరచుకోకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం