రాశి ఫలాలు (దిన ఫలాలు) : 05.03.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: ఫాల్గుణ, వారం : బుధవారం, తిథి : శు. షష్టి, నక్షత్రం : భరణి
ఉత్తమ కాలం నడుస్తోంది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్ధతను చాటుకుంటారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంది. భూ, గృహ యోగాలున్నాయి. దైవబలం అనుకూలిస్తుంది. మిత్రుల సాయం అందుతుంది. శుభవార్త వింటారు. శివపార్వతులను దర్శించుకోండి.
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార యోగం ఉంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో ఆత్మీయుల సహకారం అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించండి.
ముఖ్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల మనసు నొచ్చుకోకుండా వ్యవహరించండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది. అర్ధంలేని ఆలోచనలు వద్దు. చెడును ఊహించకండి. ముఖ్యమైన పనుల్ని వీలైనంత ముందుగా ఆరంభించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నవగ్రహ స్తోత్రాలు పరించండి.
శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి పనులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదృష్టయోగం వరిస్తుంది. ఏ విషయంలోనూ ఆశ్రద్ధ వద్దు. కలహాలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. పరిస్థితులకు తగినట్టు ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. పొదుపు-మదుపు దిశగా ఆలోచించండి. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి..
ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆటంకాలు ఎదురైనా, నేర్పుతో వాటిని అదిగమిస్తారు. కాలాన్ని వృథా చేసుకోవద్దు. బుద్ధి చతురత అవసరం. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఆలోచనల్లో స్పష్టత పెరగాలి. గత అనుభవాల్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. విభేదాలు కీడు చేస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి..
అదృష్టం వరిస్తుంది. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుని విజయాలు సాధిస్తారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పదవీయోగం ఉంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త రుణ సమస్యలు ఎదురుకావచ్చు. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించుకోండి.
ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించండి. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు వరిస్తాయి. గ్రహదోషం వల్ల ఉద్యోగంలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయినా నిరాశపడకండి. అనవసర సంబాషణలు శత్రువులను పెంచుతాయి. అపనిందలు. ఇబ్బందిపెట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు వికటిస్తాయి. నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి.
శుభప్రదమైన సమయం. బుదబలం వ్యాపార అభివృద్ధిని సూచిస్తోంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. వినూత్నంగా ఆలోచిస్తారు. పురస్కారాలు అందుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదృష్ట యోగం ఉంది. ఆర్ధికంగా బలపడతారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. శుభవార్త వింటారు. శ్రీమహావిష్ణువును పూజించండి.
అదృష్ట యోగం ఉంది. కలలను సాకారం చేసుకుంటారు. కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. పదవీయోగం ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. శుభవార్త వింటారు. వేంకటేశ్వర స్వామిని పూజించండి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాదిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వాహనయోగం ఉంది. మహాగణపతిని ఉపాసించండి.
లక్ష్యసాధనలో ఏకాగ్రత తప్పనిసరి. బుద్ధి స్థిరత్వం అవసరం. గ్రహదోషం అధికంగా ఉంది. మనోబలాన్ని పెంచుకోవాలి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రగతిని సాధిస్తారు. శుభం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి..
మనోబలంతో పనులు మొదలు పెట్టండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయకండి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనయోగం ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల జోక్యాన్ని ప్రోత్సహించకండి. వ్యాపారంలో సృజనాత్మకత అవసరం. నవగ్రహ శాంతి జరిపించండి.