Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు.. ఆరోగ్యం బాగుంటుంది-today rasi phalalu mesha rasi to meena rasi march 26th wednesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు.. ఆరోగ్యం బాగుంటుంది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు.. ఆరోగ్యం బాగుంటుంది

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 26.03.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 26.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : బుధవారం, తిథి : కృ. ద్వాదశి, నక్షత్రం : ధనిష్ట

మేష రాశి

మేష రాశి వారికి గ్రహస్థితి నిరాశాజనకం. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్త వింటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు.

వృషభ రాశి

వృషభ రాశి వారు తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపి వేయవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు.

మిథున రాశి

మిథున రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. సన్నిహితులకు ధనసహాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయం బాగుంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.

కన్య రాశి

కన్య రాశి వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.

తుల రాశి

తుల రాశి వారు కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు చేరువవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతోషకరమైన వార్త వింటారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. అసలు వదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. వేడుకకు హాజరవుతారు.

మీన రాశి

మీన రాశి వారి పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

HT Telugu Desk

సంబంధిత కథనం