Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పదోన్నతులు.. పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. దేవీ స్తుతి మంచిది-today rasi phalalu mesha rasi to meena rasi march 25th tuesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పదోన్నతులు.. పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. దేవీ స్తుతి మంచిది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పదోన్నతులు.. పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. దేవీ స్తుతి మంచిది

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.03.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today rasi phalalu: ఫిబ్రవరి 9వ తేదీ రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : మంగళవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : శ్రవణం

మేష రాశి

మేష రాశి వారు ఓర్పు, నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వేడుకలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్ధయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు, నలుపు, లేత నీలం రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు విశ్రమించరు. సంఘంలో విశేష గౌరవం దక్కుతుంది. పెండింగ్ పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఆప్తుల నుండి సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిధున రాశి

మిధున రాశి వారికి రాబడి ఆశాజకనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో చికాకులు, గులాబీ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు. వృథా ఖర్చులు, అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు గణేశ్తోత్రాలు పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. విందు వినోదాలు, వాహన యోగం. గులాబీ, లేత ఎరుపు అదృష్ట రంగులు. విష్ణుధ్యానం చేయండి.

కన్య రాశి

కన్య రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, నేరేడు అదృష్ట రంగులు. దేవీస్తుతి మంచిది.

తుల రాశి

తుల రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాల కొనుగోలు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులు, రియల్ ఎస్టేట్ల వారికి శుభవార్తలు. ఆకుపచ్చ, లేత పసుపు అదృష్ట రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి రాబడి ఆశాజనకమే. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు వడతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. ధనవ్యయం. స్వల్ప వివాదాలు, లేత ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకం, వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ధనవ్యయం. పసుపు, లేత ఆకుపచ్చ అదృష్ట రంగులు, లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

మకర రాశి

మకర రాశి వారి పనులు సజావుగా పూర్తి కాగలవు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. మనస్సాక్షికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చే వారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వ్యయ ప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఒత్తిడులు అధికం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు అదృష్ట రంగులు. గణేశాష్టకం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, తల్లి తరపు వారి నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు అదృష్ట రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారుల యత్నాలలో కదలికలు. ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు అదృష్ట రంగులు, శివాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం