Today Rasi Phalalu: ఈరోజుఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం.. నూతన విద్యా అవకాశాలు, విదేశీ అవకాశాలతో పాటు ఎన్నో-today rasi phalalu mesha rasi to meena rasi march 24th monday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజుఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం.. నూతన విద్యా అవకాశాలు, విదేశీ అవకాశాలతో పాటు ఎన్నో

Today Rasi Phalalu: ఈరోజుఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం.. నూతన విద్యా అవకాశాలు, విదేశీ అవకాశాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 24.03.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 24.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : సోమవారం, తిథి : కృ. దశమి, నక్షత్రం : ఉ.షాడ

మేష రాశి

మేష రాశి వారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలరు. రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మహా పాశుపత కంకణం ధరించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి నూతన పరిచయాలు లభిస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు కూడిన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధ పడతారు, సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. ఆహార నియమాలు పట్ల ఖచ్చితమైన శ్రద్ధని పాటించండి. వాహనం నడిపే విషయంలో మెళకువలు అవసరం.

మిథున రాశి

మిథున రాశి వారు దీర్ఘ ఆలోచనలు, దీర్ఘకాలీక సమస్యల గురించి ఎంత ఆలోచన చేసినా, కొంత మంది నిపుణులు కలుసుకున్నప్పటికీ, ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. పూజల్లో నాగ సింధూరం కుంకుమను ఉపయోగించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ప్రభుత్వపరమైన పనులు కలిసి వస్తాయి. ఎంత కాలంగానో పెండింగ్ లో ఉన్న పనులు అనుకూలిస్తాయి. దూరప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలు అంతంతమాత్రంగా ఉంటాయి. హనుమాన్ వత్తులు అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. కొన్ని ముఖ్య మైనటువంటి కారణాల వలన ధనం పెట్టుబడిగా మార్చలేరు.

సింహ రాశి

సింహ రాశి వారు దైవ దర్శనం చేసుకుంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మాట తొందరపాటు మిమ్ములను ఇబ్బందులకు గురి చేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.

కన్య రాశి

కన్య రాశి వారు సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ ద్వారా మంచి విషయాలు గ్రహిస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. శివాలయంలో అభిషేకం జరిపించండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి.

తుల రాశి

తుల రాశి వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. భూ సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది మీకు ఏమీ చేతకాదని విమర్శించడం, మనస్థాపానికి గురి చేస్తుంది. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలరు ధరించండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు, గృహప్రవేశ ప్రయత్నాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి మూర్ఖత్వం, మితిమీరిన చేష్టలు చికాకుకు గురిచేస్తాయి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అంతంత మాత్రమే లాభాలను అందుకోగలుగుతారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు కోర్టు వివాదాలు, ఇతర లీగల్ సమస్యల విషయంలో నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా ప్రయోజనాలు దక్కించుకోగలరు. ప్రభుత్వపరమైన లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తాయి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి.. కొంతమంది ముఖ పరిచయస్తులు ద్వారా కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

మకర రాశి

మకర రాశి వారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఇప్పటికే ఉన్న షాపుల్లో క్రయవిక్రయాలు స్తబ్దుగా జరగడం ఆలోచింపజేస్తుంది. మీరు ఎంతగానో శ్రమించి కష్టపడి ఫలితాలు సాధిస్తారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. నూతన విద్యా అవకాశాలు, విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి అయిన వాళ్ళు సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే లభిస్తాయి. సహోదరీ వర్గంతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు కొంతమంది వలన ఇబ్బందులకు గురవుతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని కోర్సులో చేర్పించి మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు.

మీన రాశి

మీన రాశి వారికి అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడవచ్చు. మన ఎదుగుదల వాళ్ళకి నచ్చక రకరకాలుగా విమర్శించడం తరచుగా ఏర్పడుతుంది. పక్కనే ఉండి మన విషయాన్ని తెలుసుకుని వ్యాపారంలో మనల్ని వెన్నుపోటు పొడిచే వారు ఉంటారు కనుక అప్రమత్తంగా ఉండండి. రోజూ దేవి దేవతలకు ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

HT Telugu Desk

సంబంధిత కథనం