Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభాలు.. వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది-today rasi phalalu mesha rasi to meena rasi march 19th tuesday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభాలు.. వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభాలు.. వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.03.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : బుధవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : విశాఖ

మేష రాశి

మేష రాశి వారి ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారి ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శివుడిని ఆరాధించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. చేసిన పనికి తగిన ప్రతి ఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహ రాశి

సింహ రాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నలుగురికి సాయపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదురు కావచ్చు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి.

తులా రాశి

తులా రాశి వారు కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహారయాత్రలకు వెళ్తారు. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. హనుమాన్ ఆరాధన శుభప్రదం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తి చేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మకర రాశి

మకర రాశి వారి బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారమవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేపడతారు. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. శివారాధన మేలు చేస్తుంది.

మీన రాశి

మీన రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

HT Telugu Desk

సంబంధిత కథనం