రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.03.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: ఫాల్గుణ, వారం : మంగళవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : స్వాతి
మేష రాశి వారికి పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులు మీకు చేదోడుగా నిలుస్తారు. కొన్ని రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మహిళలకు భూలాభాలు ఉండవచ్చు. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.
వృషభ రాశి వారు స్నేహితులు, ఆప్తుల సలహాలు పాటిస్తూ విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. మహిళలకు నూతనోత్సాహం. ఆదిత్య హృదయం పఠించండి.
మిథున రాశి వారికి ఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఇంటా బయటా మీకు ఎదురుండదు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ది, సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్యసేవలకు స్వస్తి చెబుతారు. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు, దేవీఖడ్గమాల పఠించండి.
కర్కాటక రాశి వారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులు మీకు అన్ని వ్యధాలా సహకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్యులతో చర్చలు సఫలం, తీర్థయాత్రలు చేస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహన యోగం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ఉద్యోగాలలో కోరుకున్న బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు వస్తాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
సింహ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మరింత అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.
భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు బాధించినా క్రమేపీ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో సత్తా చాటుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు పదవులు దక్కవచ్చు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. కనక ధారా స్తోత్రాలు పఠించండి.
కన్య రాశి వారికి మొదట్లో ఉన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆత్మీయులు, మిత్రులతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు మార్గం ఏర్పడుతుంది, ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సోదరులతో సఖ్యత, కొద్దిపాటి రుగ్మతలు బాధపెట్టవచ్చు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది. శివస్తోత్రాలు పఠించండి.
తుల రాశి వారు ముందడుగు వేసి అనుకున్నది. సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. అన్నింటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో అనుకూలత ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
ఆర్ధిక ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబసభ్యులు అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు ప్రణాళిక రచిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
వృశ్చిక రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఎంతటి వారినైనా మీ నైపుణ్యం, వాక్చాతుర్యంలో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గౌరవం అందుకుంటారు. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు. మిత్రులతో విభేదాలు తొలిగి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
కుటుంబంలో అందరూ మెచ్చుకునే రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. గతం కంటే మెరుగుపడి రుణాలు కూడా తీరతాయి. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అసుకున్న పెట్టుబడులు అందుతాయి. లాభాలు ఆర్జిస్తారు. రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మకర రాశి వారి శ్రమ ఫలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు మరింతగా చేరువ కాగలరు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఉత్సాహవంతమైన కాలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పరించండి.
కుంభ రాశి వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు, మిత్రులు శత్రువుల్లా, మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు నిర్ణయాలు మార్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. రుణాలు చేస్తారు. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగాలలో ఊహించని బదిలీలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు సోదరులు, సోదరీలతో వివాదాలు గణేశ్తోత్రాలు పరించండి.
మీన రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులకు సహాయపడతారు. తీర్ధయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. కొన్నివివాదాలు వేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం, స్వీయానుభవంతో నిర్ణయాలు తీసుకుంటారు.
ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అధిక లాభాలు గడిస్తారు. నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. ఉద్యోగాలలో విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్