Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. శత్రువులపై విజయం, ధన లాభంతో పాటు ఎన్నో-today rasi phalalu mesha rasi to meena rasi march 17th monday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. శత్రువులపై విజయం, ధన లాభంతో పాటు ఎన్నో

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. శత్రువులపై విజయం, ధన లాభంతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.03.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : సోమవారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : చిత్త

మేష రాశి

మేష రాశి వారికి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందకరంగా ఉన్నప్పటికీ అత్మీయులైన వ్యక్తులతో చర్చించి పరిస్థితులను అధిగమించగలుగుతారు. నిర్ణయ సామర్థ్యం ఉంటుంది. ప్రశాంతత పెరుగుతుంది. వృత్తిలో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములోని ముఖ్య వ్యక్తులతో వారి సహకారంతో వ్యాపారంలో అభివృద్ధి సారిస్తారు.

వ్యాపార అంశాలు శ్రమ, అధిక ఒత్తిడితో కూడుకుని ఉన్నప్పటికీ మీ సహజ సృజనాత్మకతతో మంచి ఆలోచనలతో సరియైన కమ్యూనికేషన్ తో అనుకున్నవి సాధించగలుగుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు పరుషమైన మాటల వల్ల, ఆర్థిక సంబంధమైన అంశాలు అపార్థాలు, చికాకులు రాకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ప్రయాణ విషయాలు, తొందరపాటు నిర్ణయాలు, డ్రైవింగ్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి.

సంతానానికి విద్యా సంబంధమైన విషయాలలో అభివృద్ది జీవిత భాగస్వామికి వృత్తికి సంబంధించిన అంశాలలో తగిన గుర్తింపు గౌరవం, నూతన అవకాశాలు, పలుకుబడి కలిగిన గౌరవనీయులైన గురు సంబంధీకులు, కళా రంగంలో ఉన్న వ్యక్తుల్నికలుస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. కింద వ్యక్తులు మీకు సహకారము ఇస్తారు. వృతి విషయాలలో అధికారులతో ఆకస్మిక చికాకులు.

మిధున రాశి

మిధున రాశి వారికి ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మిక నిర్ణయాలు, సంతానము, విద్యా విషయాలు, ప్రశాంతతని తగ్గిస్తాయి. కుటుంబ వాతావరణం, ఆర్థిక అంశాలు చర్చలు ఘర్షణాత్మకంగా వుండే అవకాశం ఉంది. వీలైనంత మౌనం మంచిది.

మాటల వల్ల అపార్థాలు రాకుండా ఉండడం మేలు. ఆర్థిక విషయాలలో హెచ్చుతగ్గులు. రుణముల విషయంలో రుణదాతలు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తండ్రిగారి సహకారం లభిస్తుంది. ఇతరుల సహాయంతో మీ పనులు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు భావ ప్రకటన సమయంలో భావోద్రేగాలను నియంత్రించుకోవాలి. యోగా, మెడిటేషన్ చేస్తే మంచిది. రుణములు ఆర్థిక అంశాలు వాయిదా పడతాయి. ఆలస్యాలు చికాకును కలిగిస్తాయి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర, విశ్రాంతి అవసరం. బంధువర్గంతో మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్లాలి. ఆర్థిక ఒత్తిడి, శ్రమ ఉంటుంది. జీవిత భాగస్వామి తరుపు బంధువులతో ఆర్థిక, సహకార సంబంధమైన విషయాలలో చికాకులు ఉంటాయి.

సింహ రాశి

సింహ రాశి వారి ఆగిన పనులు ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి సంబంధమైన విషయాలు కొంత వరకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తాయి. శత్రు రోగ రుణాలు మీద విజయం సాధిస్తారు. రుణాలు వసూలు అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పోటీలలో విజయాలు సాధిస్తారు. పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వృత్తిలో శ్రమ, ఖర్చులు, సమయానికి విశ్రాంతి లోపం. కొలీగ్స్ సహకారంతో సమయానికి పనులు నిర్వర్తించడానికి, పై అధికారులతో మాట పడకుండా ఉండడానికి అధిక శ్రమ చేస్తారు. తదుపరి ఆరోగ్యము, ఆర్ధిక అంశాలు కొంత ఇబ్బంది పనులు వాయిదా వేస్తారు.

కన్యా రాశి

కన్యా రాశి వారు వృత్తిపరమైన విషయాలలో మీ ఆలోచనలు ఆశించిన స్థాయిలో ఫలితములు కొంత వరకు ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి సంబంధించిన విషయాలలో మార్గదర్శకులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్ధిక అంశాలు అనుకూలం ఆత్మీయులైన ఇష్టమైన వ్యక్తులు సంప్రదింపులు సామాన్యం. ఆగిన పనులు ముందుకు వెళ్తాయి. తల్లి తరపు బంధువులతో మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు.

తులా రాశి

తులా రాశి వారు దూర ప్రయాణాలు, ఒత్తిడి, అలసటతో కార్యాలు ప్రారంభిస్తారు. కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, శుభకార్యాల నిమిత్తం చర్చలు జరుగుతాయి. కుటుంబ పెద్దల్ని శ్రేయోభిలాషులని కలిసి వారి ఆశీస్సులు, తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేసి విద్యార్థులకు శ్రమతో ఫలితాలు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. రుణ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు మానసికంగా ఏదో తెలియని నిరాశ, గందరగోళం, మాటల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉ ండాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వైఖరి, అన్న దమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. అనుకోని ఆందోళనలు, ఆకస్మిక ప్రయాణాలు చికాకులు, ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరమైన విషయాలలో అధికారులతో రాజకీయ నాయకులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ప్రారంభంలో ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. నూతన వ్యక్తులతో వ్యాపార భాగస్వాములతో ఆర్థికపరమైన విషయాలలో ఘరణాత్మకమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మైత్రి బంధాలు బలపడతాయి. తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయి.

ఇంతకుముందు ఇచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి రావలసిన ధనాన్ని కొంతమేర అందుకుంటారు. ఆకస్మికమైన ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు, డొనేషన్లు, చారిటబుల్ ట్రస్టుల విషయంలోనూ శుభకార్యాల నిమిత్తం అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. ముఖ్యంగా పనులు వాయిదా ఆటంకాలు, చికాకును కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.

మకర రాశి

మకర రాశి వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. నైపుణ్యాలు పెరుగుతాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తికి సంబంధిం దిన విషయాలు కొంతవరకు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. శ్రమతో గౌరవాన్ని, ఆదాయాన్ని పెంచుకుంటారు. శత్రువులు మీద విజయం సాధిస్తారు. న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మైత్రి బంధాలు బాగుంటాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఇష్టమైన వారికి, సంతానం అభివృద్ది కొరకు అధికమైన ఖర్చులు చేస్తారు. తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. సృజనాత్మకత బాగుంటుంది. వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కన్నా శ్రమకి తగిన గౌరవము, గుర్తింపు లభిస్తుంది.

వ్యాపార భాగస్వాములతో మైత్రి బంధాలు బాగుంటాయి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోషల్ మీడియా మొదలైన చోట్ల మీ నెట్వర్క్ ఉపయోగించి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కోసం కొత్త కమ్యూనికేషన్ విధానాలు రూపాందిస్తారు.

మీన రాశి

చంద్రుడు కుజునితో కలిసి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైన విషయాలు, సిరాస్తులు, తల్లి ఆరోగ్యం, విద్యా సంబంధమైన విషయాలు, గృహ వాహన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పెద్దల సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం మీద, ముఖ్యంగా కంటికి సంబంధించిన శ్రద్ధ అవసరం. ధైర్యం, పరాక్రమం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్ విధానం పెరుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

HT Telugu Desk

సంబంధిత కథనం