Today Rasi Phalalu: ఈరోజు మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు.. పరమేశ్వరుడిని ప్రార్ధించండి!-today rasi phalalu mesha rasi to meena rasi march 16th sunday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు.. పరమేశ్వరుడిని ప్రార్ధించండి!

Today Rasi Phalalu: ఈరోజు మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు.. పరమేశ్వరుడిని ప్రార్ధించండి!

HT Telugu Desk HT Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.03.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : ఆదివారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : హస్త

మేష రాశి

మేష రాశి వారికి అదృష్టం వరిస్తుంది. విజయాలు అందుకుంటారు. బుద్ధిబలం కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతి ప్రతిభను చాటుకుంటారు. వ్యాపార నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం, ఆత్మీయులతో సున్నితంగా సంభాషించండి. సంపదలు పెరుగుతాయి. భూలాభం సూచితం. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మహాలక్ష్మిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. లక్ష్యసాధన సులభతరం అవుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ వల్ల నలుగురికీ ఉపకారం జరుగుతుంది. సంభాషణా చాతుర్యం అవసరం. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. వ్యాపార నిర్ణయాల్లో పట్టువిడుపులు అవసరం. మధ్యలో ఓ మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

మిథున రాశి

మిథున రాశి వారు సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహదోషం ఉంది. మనోబలంతో ఆ ప్రభావాన్ని అధిగమించండి. లోతైన ఆలోచన తర్వాతే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. చెడును ఊహించుకోవద్దు. ఒత్తిడికి గురికావద్దు. కుటుంబ సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకోండి. కొందరి విషయంలో సహనం అవసరం. కొత్త ప్రయోగాలకు సమయం కాదు. గణపతిని ఉపాసించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఆర్థిక ఫలితాలు అనుకూలం. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆలోచనల్లో చంచలత్వం వద్దు. కొన్ని పరిస్థితులు ఒత్తిడికి గురిచేస్తాయి. స్థిరచిత్తంతో వ్యవహరించండి. ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. గ్రహబలం విషయంలో మిశ్రమకాలం నడుస్తోంది. పరిస్థితుల్ని బట్టి స్పందించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

సింహ రాశి

మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా స్పందించండి. క్షణికావేశం మంచిది కాదు. కొన్ని శక్తులు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా, మీదైన మార్గాన్ని వదిలి పెట్టకండి, ఆర్ధిక ఫలితాలు బావుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్రాలు పరించండి.

కన్య రాశి

కన్య రాశికి కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి.

తుల రాశి

తుల రాశి వారికి వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మనోబలాన్ని ఇస్తుంది. స్థిరచిత్తంతో వ్యవహరించండి. ఇతరులకు ఆర్థిక సాయం చేస్తారు. అనుకోని సంఘటన జరుగుతుంది. వాగ్వాదాలకు ఆస్కారం ఇవ్వకండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ధనయోగం ఉంది. ఆలోచనా విధానం మెరుగ్గా ఉంటుంది. వివాదాస్పద అంశాల్లో తల దూర్చవద్దు. కొన్ని అపవాదులు భరించాల్సి వస్తుంది. ఆ సమయంలో మీ వ్యక్తిత్వమే మీకు రక్షణ రక్షణ కవచం అవుతుంది. మానసిక ప్రశాంతత అవసరం. ప్రేమగా సంభాషించండి. మరింత కృషితో ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. పరమేశ్వరుడిని ప్రార్ధించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అదృష్టం వరిస్తుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఆధ్యాత్మిక సాధన అవసరం. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించండి.

మకర రాశి

మకర రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. బలమైన సంకల్పంతో ముందుకు సాగండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఉపకార బుద్ధితో వ్యవహరించండి. ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా బలపడతారు. సంపదల్ని సద్వినియోగం చేసుకోండి. ఓ శుభవార్త వింటారు. సద్గురువును దర్శించుకోండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి శుభప్రదమైన సమయం. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారం సాఫీగా సాగుతుంది. కొన్ని గందరగోళ పరిస్థితుల రాశి నుంచి బయటపడతారు. జీవిత లక్ష్యం పట్ల స్పష్టత వస్తుంది. ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో సమావేశం అవుతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి జన్మ శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఆర్థిక ప్రగతికి అనువైన కాలం. అత్యుత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహదోషం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. అయినా, ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ప్రత్యర్థుల విషయంలో దూకుడు వద్దు. సంయమనం అవసరం. ఒత్తిడిని జయిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అజాగ్రత్త తగదు. శ్రీమహావిష్ణువును ధ్యానించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk

సంబంధిత కథనం