Today Rasi Phalalu: హొలీ నాడు ఈ రాశి వారికి కొత్త వస్తువులు, శుభవార్తలు.. లక్ష్మీధ్యానం శుభప్రదం-today rasi phalalu mesha rasi to meena rasi march 14th friday check your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: హొలీ నాడు ఈ రాశి వారికి కొత్త వస్తువులు, శుభవార్తలు.. లక్ష్మీధ్యానం శుభప్రదం

Today Rasi Phalalu: హొలీ నాడు ఈ రాశి వారికి కొత్త వస్తువులు, శుభవార్తలు.. లక్ష్మీధ్యానం శుభప్రదం

HT Telugu Desk HT Telugu
Published Mar 14, 2025 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.03.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.03.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : శుక్రవారం, తిథి : శు. పౌర్ణమి, నక్షత్రం : ఉత్తర

మేష రాశి

మేష రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు మంచి సమయం, విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారు నలుగురిలో మంచి పేరు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి మార్పు వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన శ్రేయస్కరం.

మిథున రాశి

మిథున రాశి వారు ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు మంచి సమయం. పై అధికారులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వ పనుల్లో కదలిక వస్తుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. స్నేహితుల అండదండలు లభిస్తాయి. వాహన మరమ్మతుల కారణంగా ధన వ్యయం. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు కొంత శ్రమించాల్సిన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. దత్తాత్రేయస్వామిని ఆరాధించండి.

సింహ రాశి

సింహ రాశి వారు ప్రారంభించిన పనులు సజావుగా పూర్తవుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పెద్దవారి సూచనలు నిర్లక్ష్యం చేయకండి. మరింత మంచి మార్పు గోచరిస్తుంది. కళాకారులకు చక్కటి అవకాశాలు తారసిల్లుతాయి. రాబడి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

కన్య రాశి

కన్య రాశి వారి రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రాబడి పెరుగుతుంది. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. భూలావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. స్నేహితులతో మాట పట్టింపులకు పోవద్దు. వ్యాపారులకు మంచి సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

తులా రాశి

తులా రాశి వారి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి, సత్ఫలితా లను పొందుతారు. భూ వ్యవహారాల్లో ఆజాగ్రత్త వద్దు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభవార్త వింటారు. ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గా దేవి స్తోత్రాలు పఠించండి.

మకర రాశి

మకర రాశి వారి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. భూముల కొనుగోలు విషయంలో కొంత కలిసివస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి

రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రామాలయాన్ని సందర్శించండి.

మీన రాశి

మీన రాశి వారి ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్దలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. దక్షిణా మూర్తిని ఆరాధించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner

సంబంధిత కథనం